వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శిల్పా అప్పుడేం చేయలేదు, అఖిలప్రియ ఇప్పుడేం చేయలేదు, ఆ కులాలదే'

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయని ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ పిలుపునిచ్చింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయని ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ పిలుపునిచ్చింది.

చదవండి: వారికి నోటీసుల షాక్: రెండేళ్ల పదవికి ఆశపడి శిల్పా ఆఫర్ మిస్ చేసుకున్నారా?

గురువారం నంద్యాల పట్టణంలోని కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీకి మిత్రపక్షం టిడిపి, ప్రతిపక్షం వైసిపిలు సలాం చేసే పార్టీలు అని మండిపడ్డారు.

What Silpa and Bhuma family did for Nandyal

నంద్యాల నుంచి వైసిపి తరఫున ఇప్పుడు పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి అధికార పార్టీలో ఉండి ఏం చేశారని ఆయన నిలదీశారు. ప్రతిపక్షంలోకి వచ్చి నంద్యాలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

అలాగే, వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన భూమా కుటుంబం, మంత్రి అఖిలప్రియ ఏం అభివృద్ధి పనులు చేశారో చూపించాలని ఆయన నిలదీశారు. ఈ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నిస్తున్నాయన్నారు.

ఓటర్లు ఆలోచించి నంద్యాల అభివృద్ధికి పాటుపడే వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో ఆధిపత్య కులాలకే సీట్లు ఇస్తున్నారని మైనార్టీ, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
What Silpa Mohan Reddy and Bhuma family did for Nandyal in last three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X