వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ముందు జగన్ వినతుల చిట్టా-జాబితాలో కీలక ప్రాజెక్టులు-తెలంగాణ బాకీలపైనా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన ముందు విజ్ఢప్తులు పెట్టారు. ఈ జాబితాలో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా సంక్షిప్తంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ ముందు జగన్ పెట్టిన డిమాండ్ల చిట్టాను ఓసారి పరిశీలిద్దాం..

Recommended Video

ఢిల్లీలో సీఎం జగన్, నేడు ప్రధానితో భేటీ *National | Telugu OneIndia
 మోడీ ముందు జగన్ వినతుల చిట్టా

మోడీ ముందు జగన్ వినతుల చిట్టా

ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఇవాళ సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం, రీసోర్స్‌ గ్యాప్‌కింద నిధులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పీఎంకు వినతిపత్రం అందించి, వాటిపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు.

 పోలవరం ప్రాజెక్టుపై

పోలవరం ప్రాజెక్టుపై

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకోసం తన సొంతంగా రూ.2900 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని, వీటిని వెంటనే రియంబర్స్‌ చేయాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కూడా కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా రియంబర్స్‌ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం జరుగుతోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణలోకి తీసుకుని ఆమేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చేసిన పనులకు 15 రోజుల్లోగా రియంబర్స్‌చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీబీటీ పద్ధతిద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా అడహాక్‌గా రూ.10వేల కోట్లు ఇవ్వాలని కోరారు.

 రాష్ట్రానికి నిధుల విడుదలపై

రాష్ట్రానికి నిధుల విడుదలపై

రీసోర్స్‌గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
2014-15 కాలానికి సంబంధించిన బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల రూపంలో, పెన్షన్లు తదితర రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈనిధులను మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టంకింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడంవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఇదివరకే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థద్వారా రేషన్‌ అందుతోందని, వీరిలో 61శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 41 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని సీఎం వివరించారు. చట్టం నిర్దేశించిన ప్రకారమే గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మందికి, అర్బన్‌ ప్రాంతంలో 50శాతం మందికి పీడీఎస్‌కింద ప్రయోజనాలు అందాల్సింది ఉందన్నారు. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌రాష్ట్రాల్లో రాష్ట్రంకంటే కనీసంగా 10శాతం మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారని వివరించారు. దీనివల్ల అర్హులైన వారికి రాష్ట్రంలో వర్తింపు కావడంలేదని, కేంద్రం ఇస్తున్నదానికంటే అదనంగా దాదాపు 56లక్షలమందికి పీడీఎస్‌ను రాష్ట్రమే వర్తింపు చేస్తోందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారమని, ఇప్పటికే దీనిపై నీతిఆయోగ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై తదుపరి కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న కేటాయింపులను పరిశీలించాలంటూ చెప్పిన విషయాన్ని ప్రధానికి జగన్ గుర్తుచేశారు.

 గరీబ్ కళ్యాణ్ యోజనపై

గరీబ్ కళ్యాణ్ యోజనపై

కోవిడ్‌సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే, కేంద్రం కవర్‌ చేయని, అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపు చేసిందని, దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్రం యోయాల్సి వచ్చిందని ప్రధానికి జగన్ వివరించారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని కోరారు. నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యంకోటాలో 3 లక్షల టన్నులు వినియోగంకాకుండా ఉంటున్నాయని, ఇందులో కేవలం 77వేల టన్నులు కేటాయిస్తే సరిపోతుందని, కేంద్రంపై కూడా ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రధానమంత్రికి వివరించారు.

 తెలంగాణ బకాయిలు

తెలంగాణ బకాయిలు

తెలంగాణ డిస్కంలనుంచి రావాల్సిన బకాయిల కూడా జగన్ ప్రధాని ముందు ప్రస్తావించారు. తెలంగాణ నుంచి రూ.6,756 కోట్లు ఏపీకి బకాయిలు ఉన్నాయని, 8 ఏళ్లుగా ఈసమస్య అపరిష్కృతంగానే ఉందని తెలిపారు. ఈ డబ్బు ఇప్పిస్తే పూర్తిగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయని, ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. విభజనలో హేతుబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు.

 కేంద్రమిచ్చిన హామీల అమలుపై..

కేంద్రమిచ్చిన హామీల అమలుపై..

పార్లమెంటుసాక్షిగా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు చేయాలని సీఎం జగన్ కోరారు. ప్రత్యేక తరగతి హోదా సహా హామీలను అమలు చేయలని విజ్ఞప్తిచేశారు. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రంనుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేకతరగతి హోదా ద్వారా వస్తాయని, తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్తగామూడు కాలేజీలకు అనుమతి ఇచ్చారని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉందని, వీటిని మంజూరుచేయాలని పీఎంకు విజ్ఞప్తిచేశారు. కడపలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కూడా సీఎం కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకమని, స్థిరంగా ఖనిజం రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత కీలక అంశమని తెలిపారు. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్‌ మినరల్‌ ఏరియాలను కేటాయించాలని కూడా కోరారు. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని ప్రధానికి జగన్ వివరించారు.

English summary
ap cm ys jagan on today placed several key demands before pm modi during his half an hour long meeting with prime minister modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X