ఈ సర్వే ఎక్కడ: జగన్‌కు సిఎం, పవన్ ఉన్నది చెప్పారు

Where is CNN IBN survey in Jagan's media: CM Ramesh
హైదరాబాద్: రెండు నెలల క్రితం సిఎన్ఎన్ - ఐబిఎన్ ఛానల్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా అని సర్వే ఇస్తే ఆయన మీడియాలో దాన్ని పతాక శీర్షికల్లో వేసుకున్నారని, అదే ఛానల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హవా అని ఇస్తే జగన్ మీడియాలో అది ఎందుకు కనిపించదని టిడిపి నేత సిఎం రమేష్ ప్రశ్నించారు.

రోజూ మీరు మాట్లాడే పత్రికా విలువలు, రాజకీయ విలువలు ఇవేనా? అన్నారు. ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు సిఎన్ఎన్ ఇచ్చిన రెండు సర్వేలనూ ప్రచురించాయని, జగన్ మీడియా అలా ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. రెండు మూడు రోజుల క్రితం సర్వే అంటూ కొన్ని ఫలితాలిచ్చిన ఓ ఛానల్ దీన్ని పోల్చిచూసుకోవాలని, చానెల్‌ను అద్దెకు ఇవ్వడం మంచిది కాదన్నారు.

తమకు ఏ సర్వేల మద్దతూ అవసరం లేదని, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడితే చాలన్నారు. సీమాంధ్రలో 93 మునిసిపాలిటీల్లో అరవైకి పైగా తాము గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలోనూ అత్యధికం తమకే వస్తాయని, దానికి భయపడే ఆ ఫలితాలను ఆపాలని జగన్ పార్టీ నానా తంటాలూ పడుతోందన్నారు.

వైయస్ విజయమ్మ వారం నుంచి కడప జిల్లాలోనే ఇల్లిల్లూ తిరుగుతున్నారని, ఆ కుటుంబం మొత్తం తిరిగినా అక్కడ మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో టిడిపి మొదటి స్థానంలో ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు నాలుగు సీట్లు వస్తే వాటిని అడ్డుపెట్టుకొని తన కేసుల సంగతి చూసుకుంటాడని, తాము గెలిస్తే సీమాంధ్ర అభివృద్ధి సంగతి చూస్తామన్నారు.

ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌లో నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్ళు కూడా సీట్ల హామీ లేకపోయినా టిడిపిలో చేరుతున్నారని, వైయస్ ఆశయాల సాధన కోసం పెట్టామంటున్న జగన్ పార్టీలో ఆయనకు సన్నిహితులైన కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సూరీడు వంటివారు లేరన్నారు.

వైయస్‌ను విపరీతంగా తిట్టిన ఉమ్మారెడ్డి, మైసూరా, రోజా, లక్ష్మీ పార్వతి వంటివాళ్లే ఉన్నారన్నారు. వాళ్ళలోనూ కొందరు టిడిపిలోకి వస్తామని తమకు ఫోన్లు చేస్తున్నారని, మునిసిపల్ ఎన్నికల ఫలితాల జగన్ పార్టీ కూడా ఖాళీ అవుతుందన్నారు. పవన్ కల్యాణ్ ఉన్న విషయం చెప్పాడని తెగ తిడుతున్నారని, మంచివాళ్ళకు ఓటు వేయమని ఆయన చెబితే వీళ్ళకు బాధ ఎందుకన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+