జగన్ కార్లపై యనమల సెటైర్, అనిల్ కోసం కెఏ పాల్‌కు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్లు కాకులు ఎత్తుకు వెళ్లాయా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోమవారం ఎద్దేవా చేశారు. తప్పుడు అఫిడవిట్‌లు చూపించి చివరికి ఈసిని కూడా జగన్ మోసం చేశాడని ఆరోపించారు.
నిత్యం ఆయన తిరిగే బిఎండబ్యూ కార్లు ఎవరివన్నారు. ఆయన పేరిట రిజిస్ట్రేషన్ అయిన బిఎండబ్యూ ఎక్స్-5, స్కార్పియో కార్లు ఎక్కడికెళ్లాయో చెప్పాలన్నారు. ఆ కార్లను కాకులేమైనా ఎత్తుకెళ్లాయా అని ఎద్దేవా చేశారు. షేర్ల అమ్మకాలు, కంపెనీల్లో వాటాలు, బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు, కబ్జాలు అన్నింటిలోనూ జగన్ మోసాలు చేశాడన్నారు.

అందుకే 20కి పైగా కేసుల్లో 420 సెక్షన్ నమోదయిందన్నారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇన్ని కేసులు, సెక్షన్లు ఉన్న అఫిడవిట్ మరొకటి లేదన్నారు. బ్రదర్ అనిల్ కుమార్‌కు ఉపాధి కల్పించడానికే కెఏ పాల్‌కు వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్ర అన్యాయం చేశారన్నారు.
తండ్రి చనిపోయాడనే బాధ కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం రాయబారాలు నడిపిన స్వార్థపరుడు వైయస్ జగన్ అని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో కూడా ఫ్యాక్షన్ చిచ్చుపెట్టాలనే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications