వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఆరుగురికే ఛాన్స్: కేసీఆర్ కేబినెట్లో ఎవరికి ఏ శాఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Who get what in KCR's cabinet
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు పదకొండు మంది మంత్రులుగా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం శాఖలను కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది శాసన సభ్యులు ఉన్నందున కేబినెట్లో 18 మంది మించకూడదు.

తొలి విడతగా కెసిఆర్‌తో పాటు 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. కాగా, మంత్రులకు కెసిఆర్ శాఖలను అప్పగించారు. సంక్షేమ శాఖలన్నింటిని ఆయన తన వద్దే ఉంచుకున్నారు.

ఎవరికి ఏ శాఖ?

నాయిని నర్సింహా రెడ్డి - హోంశాఖ

ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ, పౌరసరఫరాలు

కెటి రామారావు - ఐటి, పంచాయతీరాజ్ శాఖ

పద్మారావు - ఎక్సైజ్ శాఖ

రాజయ్య - వైద్య, ఆరోగ్య శాఖ

హరీష్ రావు - నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాలు

జగదీశ్వర్ రెడ్డి - విద్యాశాఖ

పోచారం శ్రీనివాస్ రెడ్డి - వ్యవసాయ శాఖ

జోగు రామన్న - అటవీ, పర్యావరణం

అలీ - రెవెన్యూ శాఖ

మహేందర్ రెడ్డి - రోడ్డు, రవాణా

కాగా, అలీ, రాజయ్యలను ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వరించే అవకాశముందని తెలుస్తోంది. కొప్పుల ఈశ్వర్‌కు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశముంది. కెసిఆర్ కేబినెట్లో మైనార్టీలకు ఒకటి, బిసిలకు 3, వెలమలకు రెండు, రెడ్డిలకు 4, ఎస్సీలకు ఒక బెర్త్ దక్కంది.

కెసిఆర్‌కు రఘువీరా శుభాకాంక్షలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కె చంద్రశేఖర రావుకు ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కెసిఆర్ తెలుగు భా,లో ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
Who get what in K Chandrasekhar Rao's cabinet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X