కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మనల్నే కోరారు- బాలయ్య సైతం : విజన్ ఎవరికి ఉన్నట్లు : సభలో జగన్ ఫైర్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. సమావేశాల ప్రారంభ సమయంలో టీడీపీ సభ్యులు గవర్నర్ ను అవమానించారంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబు సభకు ఎందుకు రావటం లేదో ఆయనకే తెలియాంటూ..అయితే, టీవీలో మాత్రం చూస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు. అసలు చంద్రబాబు ఏదైనా ఒక మంచి పని చేసారా అని ప్రశ్నించారు. ఆయన పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనని ఎద్దేవా చేసారు.

ఒక్క మంచి పని చేసారా

ఒక్క మంచి పని చేసారా

ఆయన అమలు చేసిన ఒక్క మంచి పధకం ఉందా అంటూ ప్రశ్నించారు. రాజ్యంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట అని ఫైర్ అయ్యారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు.. పేదలకు ఇంటి స్థలాలు.. పేదలకు సంబంధించి ఏ నిర్ణయమైనా న్యాయస్థానాల్లో కొట్టి వేస్తే ఎక్కువగా సంతోషించేది చంద్రబాబేనంటూ ధ్వజమెత్తారు. 34 నెలల పాలనలో చెప్పిన ప్రతీ మాట జగన్ అమలు చేయటంతోనే..ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకి ఓటు వేసారని చెప్పుకొచ్చారు. చివరకు కుప్పం లో సైతం వైసీపీ జెండా ఎగిరిందని గుర్తు చేసారు. 87 మున్సిపాల్టీలో 84.. 12 కార్పోరేషన్లు గెలుచుకున్నామని వివరించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పాలనను ప్రజల ముందు ఉంచామన్నారు. చంద్రబాబుకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అయినా వచ్చిందా అని ప్రశ్నించారు.

రాజధానులు వ్యతిరేకిస్తున్న వారు సైతం

రాజధానులు వ్యతిరేకిస్తున్న వారు సైతం


తనకు ప్రధానిగా..రాష్ట్రపతిగా అవకాశం వచ్చినా తిరస్కరించానని సొంత మీడియాలో రాయించుకోవటం మినహా ఆయన ప్రజలకు చేసిందో ఏంటో చెప్పాలన్నారు. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంతో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు 42 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నెలకు 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం వెయ్యి ఇస్తే.. మేం రూ.2500 ఇచ్చాం. పదవుల గురించే తప్ప ఏరోజూ ప్రజల గురించి చంద్రబాబు ఆలోచించలేదని సీఎం జగన్ మండిపడ్డారు. లంచం లేకుండా చంద్రబాబు ఏ పథకాన్నైనా ఇచ్చారా? అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారు సైతం జిల్లాల ఏర్పాటు విషయంలో.. తమ పాలనలో పిటీషన్లు ఇస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు - బాలయ్య మనల్నే కోరుతున్నారు

చంద్రబాబు - బాలయ్య మనల్నే కోరుతున్నారు


చంద్రబాబు బామ్మర్ది హిందూపూర్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ తమను కోరారని సీఎం చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. చంద్రబాబు తన సొంత నియోకవర్గం కుప్పంను రెవిన్యూ డివిజన్ కావాలంటూ తమ ప్రభుత్వాన్ని అడుగుతున్నారని వివరించారు. ఎవరికి ఎంత విజన్ ఉందో దీని ద్వారా అర్ధం అవుతుందని..దీనిని ప్రజలు ఆలోచించాలని సీఎం సూచించారు. చంద్రబాబుకు ప్రజల భవిష్యత్ గురించి అవసరం లేదని.. ఆయనకు రాజకీయాలే కావాలని విమర్శించారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయికి తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియం చదవాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళితే..తమ ప్రభుత్వంలో చేసిన డెవలప్ మెంట్ ఏంటో అర్దం అవుతుందని సీఎం జగన్ వివరించారు.

English summary
AP CM Jagan had said in the assembly that Chandrababu had reached out to the govt to make Kuppam as revenue division that he couldnt fulfil in his tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X