ఎన్టీఆర్‌ను అనను: వైఎస్ రగడపై జగన్, బిగ్‌బాస్ ఎవరో

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ నేతల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. వైయస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు జగన్ మండిపడ్డారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దని, ఎన్టీఆర్ గురించి తాము ఎప్పుడు చెడుగా మాట్లాడలేదని, ఇక ముందు కూడా మాట్లాడనని జగన్ అన్నారు. లేని వారిపై అభాండాలు వద్దన్నారు. అలాగే జగన్ టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ పైనా మండిపడ్డారు.

తాము పెట్టిన అవిశ్వాసానికి టిడిపి మద్దతిస్తే అప్పుడే కాంగ్రెసు పార్టీ ఇంటికి వెళ్లేదన్నారు. నల్లధనంపై చర్యలకు తాము మద్దతు పలుకుతున్నామన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే సోమవారం 17 సార్లు మైక్ కట్ చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇచ్చారో చెబితే తాము ఆమేరకు పరిమితం అవుతామన్నారు. తనకు ఇచ్చిన సమయంలో అధికారపక్షం పలుమార్లు అడ్డుకుందన్నారు.

Who is Big Boss?: YS Jagan questions

అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లో టిడిపి.. ఓటు వేయని వారిపై దాడులకు దిగిందని ఆరోపించారు. అనంతపురంలో రైతుల తోటలను ధ్వంసం చేశారన్నారు. తమ పార్టీకి చెందిన పలువురు చనిపోయారని, మరికొంతమంది గాయపడ్డారన్నారు. తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకునే నాయకత్వం కావాలన్నారు. నెల రోజుల ప్రభుత్వంలో పక్క పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు.
బెయిల్ కోసం నాటకాలు

బిగ్ బాస్ అంటే ఉలుకెందుకు?

హసన్ అలీ చెప్పిన బిగ్ బాస్ ఎవరు అని జగన్ ప్రశ్నించారు. హసన్ డైరీ వివరాలను సిట్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. హసన్ అలీ నుండి డబ్బులు తెప్పించిన బిగ్ బాస్ ఎవరో చెప్పాలన్నారు. బిగ్ బాస్ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బాబు జమానా.. అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు రాసిన పుస్తకం చదివితే అంతా తెలుస్తుందన్నారు. బాబు పైన చాలా కేసులు ఉన్నాయని, ఒక్క ఐఎంజి కేసు పైన విచారణను ఆదేశించుకోగలరా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+