వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో అద్భుత అవకాశం: అవార్డులు, రికార్డ్‌లు.. ఎవరీ గల్లా జయదేవ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. మూడు రోజుల క్రితం అవిశ్వాసాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు. తొలుత ఆయనే మాట్లాడాల్సి ఉంది. కానీ గల్లా వాక్చాతుర్యం తెలిసిన చంద్రబాబు.. కేశినేని తప్పించి, అతనికి అవకాశమిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై గల్లా చర్చ ప్రారంభించడంతో ఇప్పుడు ఆయనపై చర్చ సాగుతోంది.

గల్లా జయదేవ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా. అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. సభలో చాలా స్పష్టంగా, ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడారు. 2014లో మోడీ ఇచ్చిన హామీలను ఫుల్‌ఫిల్ చేయలేదని సభలో విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో భరత్ అనే నేను సినిమా ప్రస్తావన కూడా తెచ్చారు.

మిస్టర్ ప్రైమినిస్టర్ అంటూ నిలదీత

మిస్టర్ ప్రైమినిస్టర్ అంటూ నిలదీత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రంగానే విమర్శించారు. మిస్టర్ ప్రైమినిస్టర్.. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఏపీలో బీజేపీ పూర్తిగా లేకుండా పోతుంది, ఇది బెదిరించడం కాదు, ఇది మీకు శాపం అవుతుందని గల్లా జయదేవ్ హెచ్చరించారు. తన ప్రసంగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రస్తావన తెచ్చారు. పటేల్ విగ్రహానికి రూ.3వేల కోట్లు ఇచ్చారని, ఏపీ రాజధానికి మాత్రం కేవలం రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు.

ఇదీ గల్లా జయదేవ్

ఇదీ గల్లా జయదేవ్

గల్లా జయదేవ్ వెస్ట్‌మంట్ హైస్కూల్లో చదివారు. ఇల్లినాయిస్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేశారు. పాప్ కల్చర్, స్కూబా డైవింగ్, టెన్నిస్ అంటే ఇష్టం. ప్రయాణం అంటే ఆసక్తి. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. అతను స్పోర్ట్స్‌మెన్. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్.

గల్లా జయదేవ్‌ను వరించిన అవార్డులు

గల్లా జయదేవ్‌ను వరించిన అవార్డులు

గల్లా జయదేవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మెంబర్. 2015లో బిజినెస్ టుడే ఇఛ్చిన బెస్ట్ సీఈవో అవార్డు గల్లాను వరించింది. సీఎన్‌బీసీ - టీవీ18 ఇండియన్ బిజినెస్ లీడర్‌షిప్ అవార్డు కూడా వరించింది. మూడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో మెంబర్. డిఫెన్స్, ప్రయివేటు మెంబర్స్ బిల్, రిసొల్యూషన్స్ అండ్ కాన్సులేటివ్ కమిటీ పవర్ మినిస్ట్రీలలో మెంబర్.

 లోకసభకు హాజరు రికార్డ్ బాగుంది

లోకసభకు హాజరు రికార్డ్ బాగుంది

గల్లా జయదేవ్ పార్లమెంటుకు దాదాపు రెగ్యులర్‌గా హాజరవుతారు. 93 శాతం హాజరు రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు పార్లమెంటులో 432 ప్రశ్నలు అడిగారు. అవిశ్వాసం సందర్భంగా మాట్లాడే అవకాశం రాzడం గల్లాకు ఎంతో మంచి అవకాశమని చెబుతున్నారు.

English summary
Galla Jayadev, who initiated the no-confidence motion against Modi govt, is a battery baron and Telugu actor Mahesh Babu’s brother in law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X