వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నుంచి రాజ్యసభకు వీరే - ఇద్దరు బీసీలకు..!! సీఎం జగన్ ఖరారు - షెడ్యూల్ విడుదల..!!

|
Google Oneindia TeluguNews

రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ నుంచి నలుగురు పదవీ విరమణ చేసారు. వారిలో ప్రస్తుత సభ్యులు విజయ సాయిరెడ్డి ఉన్నారు. అదే విధంగా బీజేపీ సభ్యుడుగా ఉన్న సురేష్ ప్రభు..టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వేంకటేష్.. సుజనా చౌదరిల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10వ తేదీన ఈ నాలుగు స్థానాలకు ఎన్నిక జరగనుంది. దేశ వ్యాప్తంగా మొత్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఈ షెడ్యూల్ విడుదల అయింది. అందులో ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి.

నలుగురి పేర్లు ఖరారు..

నలుగురి పేర్లు ఖరారు..

ఏపీ శాసనసభలో వైసీపీకి ఉన్న సంఖ్యా బలంతో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న పరిశీలన ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు సమయంగా నిర్దేశించారు. ఇక, నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో..ఆ నలుగురిలో ప్రస్తుత సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డికి రెన్యువల్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు విశ్వస నీయ సమాచారం. కొద్ది రోజుల క్రితం పార్టీ పరంగా పలు పదవులు కేటాయించిన సమయంలో..సాయిరెడ్డికి తిరిగి రాజ్యసభకు ఎంపిక చేస్తారా లేదా అనే చర్చ జరిగింది. కానీ, విజయ సాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు బీసీలకు ఛాన్స్.. సాయిరెడ్డికి రెన్యువల్

ఇద్దరు బీసీలకు ఛాన్స్.. సాయిరెడ్డికి రెన్యువల్


గతంలో రాజ్యసభకు ఒకే విడతలో రెండు సీట్లు బీసీలకు కేటాయించిన సీఎం జగన్ ఈ సారి అదే ఫార్ములా వర్కవుట్ చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీదా మస్తాన రావుకు రాజ్యసభ సీటు ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఆదే విధంగా అనూహ్యంగా శ్రీకాకుళం నుంచి కేంద్ర మాజీ మంత్రి ..కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి బీసీ - మహిళ కోటాలో రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ.. సీఎం జగన్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

ఆదానీ కుమారుడికి ఖరారు...!

ఆదానీ కుమారుడికి ఖరారు...!

మంత్రి పదవులతో పాటుగా శాఖల కేటాయింపులోనూ అదే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు నాలుగు సీట్లలో రెండు బీసీ వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక, నాలుగో స్థానం తొలి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ కుటుంబానికి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, ఆదానీ సతీమణి పేరు ప్రముఖంగా వినిపించినా..ఇప్పుడు ఆదానీ కుమారుడికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయనున్నారు. కరణ్ ఆదానీ - జీత్ ఆదానీల్లో ఒకిరిని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపటం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు వైసీపీలో ప్రాధాన్యత

ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు వైసీపీలో ప్రాధాన్యత


గతంలో మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీకి సహచరుడు..ఆ గ్రూపులో కీలకంగా వ్యవహరిస్తున్న పరిమళ్ నత్వానీకి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసారు. ఇప్పుడు ఆదానీ కుటుంబానికి ఇవ్వటం ద్వారా దేశంలోనే పారిశ్రామిక దిగ్గజాలుగా ఉన్న ఇద్దరికి వైసీపీ నుంచి ప్రాధాన్యత దక్కింది. ఇప్పుడు ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనం గా మారుతోంది. చివరి నిమిషంలో మార్పులు - చేర్పులు - సమీకరణాలు మారకపోతే..ఈ నాలుగు పేర్లను వైసీపీ నుంచి రాజ్యసభకు సభ్యులుగా అధికారికంగా ప్రకటించటం ఖాయంగా తెలుస్తోంది.

English summary
Election commission have issued the schedule for conducting Rajyasabha elections for two telugu states, YSRCP almost finalised the candidates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X