పదవులు అడిగానా, బిజెపితో వైరుధ్యాలు లేవు: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోనే ఉందని 14వ, ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర విభజనలో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకొనే విచక్షణ అధికారం కేంద్రానికే ఉందని ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రకటనను బాబు గుర్తు చేశారు.

ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు.సోమవారం నాడు ఇదే విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శాసనమండలి సమావేశంలో మాట్లాడారు.

  ఒకే దెబ్బకు రెండు పిట్టలు...!

  ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో చోటు చేసుకొన్న అన్యాయంపై చంద్రబాబునాయుడు మాట్లాడారు. సెంటిమెంట్ల ఆధారంగా నిధులు కేటాయింపులు చేయలేమని జైట్లీ చేసిన కామెంట్లను బాబు ప్రస్తావించారు.

  ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోనే ఉంది

  ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోనే ఉంది

  ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోనే ఉందని ఫైనాన్స్ కమిషన్ చెబుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. విభజనలో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబు చెప్పారు. అయితే సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ ఇచ్చారని, అయితే సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని జైట్లీ ఎలా మాట్లాడుతారని బాబు ప్రశ్నించారు. విభజన తర్వాత ఏపీ రాష్ట్రానికి సుమారు 20 వేల 112 కోట్ల రెవిన్యూలోటు ఉందని బాబు చెప్పారు.

  కఠిన నిర్ణయాలు తీసుకొన్నా 35 సీట్లు గెలిచాం

  కఠిన నిర్ణయాలు తీసుకొన్నా 35 సీట్లు గెలిచాం

  1995లో తాను తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయాన్ని బాబు గుర్తు చేశారు. అయితే ఆనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పిడిఎప్ బియ్యం ధరను మూడున్నరకు పెంచామన్నారు. మద్యనిషేధాన్ని ఎత్తివేసినట్టు బాబు గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలను కూడ పెంచినట్టు చెప్పారు. కానీ, 1999లో తాను 35 ఎంపీ సీట్లను గెలుచుకొన్నట్టుగా బాబు చెప్పారు.

  దక్షిణాదిలో ఏపీ ఎదుగుదలకు కేంద్రం సహకరించాలి

  దక్షిణాదిలో ఏపీ ఎదుగుదలకు కేంద్రం సహకరించాలి

  దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ రాష్ట్రం అభివృద్ది సాధించేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. భవిష్యత్‌లో కూడ ఏపీ రాష్ట్రానికి కూడ ఆదాయం తగ్గే అవకాశం ఉందన్నారు. జీఎస్‌డీపీ ఎక్కువగా ఉందని ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం సరైంది కాదని చంద్రబాబునాయు చెప్పారు.

  ఎన్నో ప్రభుత్వాలను చూశాను

  ఎన్నో ప్రభుత్వాలను చూశాను

  తాను ఈ అసెంబ్లీలోకి అడుగుపెట్టి సుమారు 40 ఏళ్ళు పూర్తైందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. తమ పార్టీ ఎన్నో పార్టీల ప్రభుత్వాలను చూసిందని చెప్పారు. ఆర్థిక సంస్కరణల గురించి తానే తొలుత మాట్లాడినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. అంతేకాదు టెక్నాలజీ గురించి కూడ మాట్లాడిన వ్యక్తిని తానేనని బాబు గుర్తు చేశారు.

  నాలుగేళ్ళుగా బిజెపి హమీలను అమలు చేయలేదు

  నాలుగేళ్ళుగా బిజెపి హమీలను అమలు చేయలేదు

  రాష్ట్రాన్ని విభజన సమయంలో హమీలిచ్చిన కాంగ్రెస్, ఆనాడు విపక్షంలో ఉన్న బిజెపి ఏపీ రాష్ట్రానికి అండగా ఉంటామని హమీలు ఇచ్చాయని బాబు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు చేసిన ప్రసంగాలను బాబు ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ, వెంకయ్యనాయుడు, అమిత్ షా ప్రసంగాలను బాబు చదివి విన్పించారు. నాలుగేళ్ళైనా బిజెపి ఇచ్చినా హమీలు అమలు చేయలేదని చెప్పారు. రైల్వేజోన్ ఇవ్వడం కుదరదని అధికారి చెబుతున్నారు. రాజకీయంగా డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బిజెపిపై మండిపడ్డారు.

  నాకు భయం లేదు

  నాకు భయం లేదు

  తనకు భయం లేదు, లాలూచీ లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ రాష్ట్రం కష్టాల్లో ఉంది, హమీలు ఇచ్చారు. విభజన చట్టం, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని బాబు చెప్పారు. జనాభా ఎక్కువగా ప్రాంతానికి తక్కువ ఆస్తులు దక్కాయని చెప్పారు. తొలి ఏడాది లోటును ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని బాబు ప్రశ్నించారు.

  బిజెపితో రాజకీయ వైరుధ్యాలు లేవు

  బిజెపితో రాజకీయ వైరుధ్యాలు లేవు

  బిజెపితో రాజకీయ వైరుద్యాలు లేవని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు.నేనేమైనా పదవులు అడిగానా, మంత్రిపదవులు అడిగానా, గవర్నర్ పదవులు అడిగానా అంటూ బాబు ప్రశ్నించారు. బిజెపి మద్దతివ్వకపోతే విభజన బిల్లు పాస్ కాకపోయేదని బాబు చెప్పారు. విభజన కష్టాల నుండి గట్టెక్కిస్తారనే కారణంగానే బిజెపితో పొత్తును పెట్టుకొన్నామని బాబు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Special status is in the hands of union government 14th, Finance Commission said AP CM Chandrababu Naidu said. Chandrababu naidu address in Ap Assembly on Tuesday. Why Bjp not fulfill its promises to Ap asked Ap CM Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి