అసలు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? ఇవన్నీ నిజం కాదా?: విష్ణుకుమార్‌రాజు ఫైర్
Recommended Video

అమరావతి: రాష్ట్రంలో భూకబ్జాలు, ఇసుక మాఫియా నిజం కాదా? అని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. శుక్రవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీట్లు, ఓట్ల గురించి రాజకీయ క్రీడ ఆడాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి తాను అసెంబ్లీలో ప్రస్తావించానని విష్ణుకుమార్‌రాజు అన్నారు.
'వైసీపీ అధినేత జగన్‌తో బీజేపీ కలిసిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది.. ఇప్పుడు పవన్ వెనుక కూడా మేమే ఉన్నామని చెబుతున్నారు.. అసలు మేం పార్టీల వెనక, నేతల వెనక ఉండాల్సిన అవసరం లేదు.. బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల వెనుక మాత్రం ఉంటుంది..' అని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.

అంతేకాదు, అసలు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. జగన్ పరిగెడుతున్నాడని ఆయనతోపాటు పరుగులు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకనే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందన్నారు.












Click it and Unblock the Notifications