బాబు ఆ పని ఎందుకు చేయట్లేదు!: లొసుగులపై భయమా?, అంతా ఎన్నికల కుతంత్రమేనా?
విజయవాడ: కేంద్రం వైఖరిపై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణినే అవలంభించిన టీడీపీ.. ఇప్పుడు మాత్రం గట్టి పట్టే పడుతోంది. ఇన్నాళ్లు ఏదో నడిచిపోయింది గానీ.. ఇప్పుడైతే ఏదో ఒకటి తేల్చేదాకా పట్టువిడిచేది లేదని కుండబద్దలుకొడుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ద్వారా మోడీ రాయబారం నెరిపినా సరే.. చంద్రబాబు వెనక్కి తగ్గని పరిస్థితి.
Recommended Video

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కేంద్రంతో ఇంకా నాన్చుడు ధోరణి కొనసాగిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏదో ఒకటి తేల్చుకునే రావాల్సిందిగా ఎంపీలను పురమాయించారు.

ఇలా చేయవచ్చు కదా..:
పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసనలు, ఆందోళనలు బాగానే ఉన్నాయి గానీ.. విభజన హామీల అమలు కోసం చంద్రబాబు మరో పద్దతి అవలంభించి ఉండవచ్చు కదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా.. 'చేద్దాం.. చూద్దాం..' అన్న చందంగానే ఉంటుంది కాబట్టి.. డైరెక్ట్‌గా కోర్టులోనే ఎందుకు తేల్చుకోకూడదనేది కొందరి వాదన.

న్యాయపోరాటంతోనే ప్రయోజనం?:
పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను కేంద్రం పదేపదే తుంగలో తొక్కుతున్నప్పుడు సుప్రీంను ఎందుకు ఆశ్రయించరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా కేంద్రాన్ని దేబిరించుకునే బదులు.. న్యాయ పోరాటానికే దిగితే.. సుప్రీం కోర్టే ఎన్డీయేకు మొట్టికాయలు వేసి మరీ ఆదేశాలిస్తుంది కదా అన్న వాదన వినిపిస్తోంది.

మేకపోతు గాంభీర్యమేనా:
న్యాయ వ్యవస్థను ఆశ్రయించి విభజన హామీలను అమలు చేయించుకునే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే, కేంద్రం పట్ల ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికే నిరసనలు, ఆందోళనలు తప్ప.. నిజాయితీగా ఎదుర్కొనే ప్రయత్నం చేయట్లేదా? అన్న సందేహాలు తెర మీదకు వస్తున్నాయి.

బాబు భయపడుతున్నారా?:
కేంద్రంపై కోర్టుకెక్కితే పోలవరం లాంటి ప్రాజెక్టుల్లో లొసుగుల్ని ఆసరాగా చేసుకుని కేంద్రం తమ జుట్టు పట్టుకుంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఏమైనా తటపటాయిస్తున్నారా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు.
పార్లమెంటు ఇంటా, బయట నిరసనలతో టీడీపీ ఎంపీలు గట్టిగానే పోరాడుతున్నప్పటికీ.. ఈ పోరాటానికి ఫలితం దక్కుతుందా? అంటే చెప్పడం కష్టమే. కాబట్టే న్యాయవ్యవస్థ ద్వారానే కేంద్రంపై ఒత్తిడి తెస్తే బాగుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కుతంత్రమేనా?:
ఎన్నికల దాకా ఇదే రకమైన వ్యవహారాన్ని కొనసాగించి.. తీరా ఎన్నికలు దగ్గరపడ్డాక.. కొన్ని హామీలేవో కురిపించి జనాల్ని మమ్మల్ని మోసం చేసే కుట్రలకు టీడీపీ-బీజేపీ తెరలేపాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
టీడీపీ మాత్రం తాము చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నామని.. అవసరమైతే బీజేపీతో తెగదెంపులకు కూడా సిద్దమేనని చెబుతోంది. మరి.. ఈ రెండు మిత్రపక్షాలు కలిసి ఏపీని ముంచుతాయో.. తేలుస్తాయో.. వేచి చూడాల్సిందే.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications