'రేవంత్‌పై బాబు చర్యలెందుకు తీసుకోలేదు, ఏపీలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్'
రాజమండ్రి: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం ప్రశ్నించారు.
చంద్రబాబు తెరవెనుక ఉండి నడిపించిన మంత్రాంగంలో రేవంత్ పావుగా ఏసీబీకి దొరికిపోయారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బాబు అపహాస్యం చేశారని, రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారన్నారు. అవినీతి నిర్మూలన అంటూ చంద్రబాబు నీతులు చెబుతుండటం విడ్డూరమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 23 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బాంబు పేల్చారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జూన్ 9వ తేదీన వైసీపీలో చేరుతారన్నారు. నవ నిర్మాణ దీక్షలో అవినీతి నిర్మూలన అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేయడం విడ్డూరమన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలన్నారు. ఈ కేసును అవసరమైతే సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ వ్యవహారంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. దీనిపై వైసీపీ తరఫున పోరాడుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications