వాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లి
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి తనను తిట్టాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు పదేపదే ప్రస్తావించడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వాడెవడో అమ్మానాన్నలను తిట్టాడని, వీడెవడో తిట్టాడనే విషయం వదిలేయాలని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు రాజకీయాలను పక్కన పెట్టాలని, బాధ్యతల నుంచి తప్పుకోవాద్దన్నారు.

రాజకీయ ప్రయోజనాలను వద్దని హితవు పలికారు. హోదా విషయంలో ఆఖరుగా రియలైజ్ అయింది చంద్రబాబే అన్నారు. ఆయన తిట్టాడని, ఈయన తిట్టాడని పనికి రాని వాటిని తీసిపారేయాలని హితవు పలికారు. ఎవరైనా తిడితే ఏమయిందని, తిట్టుకోవడం కొత్త కాదన్నారు. ఎప్పుడు అదే ఇష్యూనా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి అవిశ్వాసంపై చర్చ జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు.
తాను పబ్లిక్‌లో మాట్లాడినప్పుడు ఎవరైనా తిట్టినా అంగీకరిస్తానని ఉండవల్లి చెప్పారు. తాను విమర్శలు చేసినప్పుడు వారికి కూడా మాట్లాడే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేను మాట్లాడితే వారికీ మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. తనను తిట్టిన వారు తనను అభిమానించినట్లుగా భావిస్తానని చెప్పారు. చంద్రబాబు అనవసరమైన వాటిని సీరియస్‌గా తీసుకోకుండా ఏపీ ప్రయోజనాలపై సీరియస్‌గా దృష్టి సారించాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications