
పొత్తులతో చంద్రబాబుకు లాభమా- నష్టమా ? గతం ఏం చెబుతోంది ? మైండ్ గేమ్ చుట్టూ చక్కర్లు !
ఏపీలో విపక్ష పార్టీ జనసేనతో పొత్తు కోసం ప్రధాన విపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. దానికి జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి లభిస్తున్న స్పందన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు కోసం వీరిద్దరూ అనుసరిస్తున్న వ్యూహాలు, వాటికి వైసీపీ నుంచి పడుతున్న కౌంటర్లు చూస్తుంటే పొత్తుతో చంద్రబాబుకు అంతగా లబ్ది చేకూరుతోందా ? పొత్తు లేకపోతే టీడీపీ విఫలవుతోందా ? గతమేం చెబుతుందన్న చర్చ సాగుతోంది.

టీడీపీ పొత్తుల ప్రస్ధానం
1983లో ఆవిర్భవించిన టీడీపీకి ముందు నుంచీ పొత్తులపై ఎనలేని ఆసక్తి. అవసరం ఉన్నా లేకపోయినా పొత్తులతో ముందుకెళ్లి పలుమార్లు గెలిచి, ఇంకొన్ని సార్లు ఓడిన చరిత్ర కూడా మూటగట్టుకుంది. 1983లో కమ్యూనిస్టుల పొత్తుతో తొలిసారి పార్టీ పెట్టిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఆ తర్వాత కూడా పొత్తుల చరిత్రను కొనసాగించింది. కమ్యూనిస్టులతో సుదీర్ఘకాలం కొనసాగించిన పొత్తుల తర్వాత తొలిసారి 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడంతో పాటు భారీగా లబ్ది పొందింది. ఆ తర్వాత 2004 బీజేపీతో కలిసి పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ... 2009లో తిరిగి కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ లతో మహాకూటమి ఏర్పాటు చేసి ఓడిపోయింది. 2014 నాటికి తిరిగి ఎన్డీయేతో కలిసి విజయం సాధించిన టీడీపీ.. 2019లో మాత్రం పొత్తుల్లేకుండా బరిలోకి దిగి దారుణ ఓటముల్ని చవిచూసింది.

టీడీపీకి కలిసొచ్చిన పొత్తులు
టీడీపీ ఆవిర్భావం సందర్భంగా అప్పటి కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పై పోరాడిన టీడీపీ తొలిసారి చరిత్ర సృష్టించింది. పార్టీ పుట్టిన 9 నెలల్లోనే 294 సీట్ల అసెంబ్లీలో ఏకంగా 201 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అప్పటి ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని కేవలం 60 సీట్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత 1994లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి 200పైకా సీట్లు గెల్చుకుంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు హయాంలోనూ 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ గెలిచిన టీడీపీ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తిరిగి 2014 ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేన పొత్తుతో టీడీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది.

టీడీపీకి కలిసి రాని పొత్తులు
టీడీపీ
ఆవిర్భావం
నుంచి
పొత్తులు
పెట్టుకుని
గెలుస్తూ
వస్తున్నా
అక్కడక్కడా
పొత్తులు
కూడా
ఆ
పార్టీకి
కలిసి
రాలేదు.
ప్రతీ
ఎన్నికల్లోనూ
చివరి
నిమిషంలో
పొత్తులు
పెట్టుకోవడం
అలవాటుగా
మార్చుకున్న
టీడీపీ
గతంలో
కమ్యూనిస్టులతో
కలిసి
పోటీ
చేసినా
1989
ఎన్నికల్లో
ఓడిపోయింది.
ఆ
తర్వాత
2004
ఎన్నికల్లోనూ
బీజేపీతో
కలిసి
ఎన్డీయే
కూటమిగా
పోటీ
చేసి
ఓడింది.
2009
ఎన్నికల
నాటికి
బీజేపీని
వీడి
టీఆర్ఎస్,
కమ్యూనిస్టులతో
పొత్తు
పెట్టుకున్న
టీడీపీకి
మరోసారి
ఓటమి
తప్పలేదు.
2019
ఎన్నికల్లో
అయితే
తొలిసారి
పొత్తు
లేకుండా
తొలిసారి
బరిలోకి
దిగి
మరీ
టీడీపీ
భారీ
పరాజయం
పాలైంది.
దీంతో
టీడీపీ
పొత్తు
లేకుండా
గెలవలేదనే
వాదన
మొదలైంది.

టీడీపీకి పొత్తు తప్పనిసరా ?
రాష్ట్ర
రాజకీయాల్ని
గమనిస్తే
టీడీపీ
పొత్తులు
పెట్టుకుని
గెలిచి,
పొత్తులు
పెట్టుకుని
మరీ
ఓడిపోయి,
పొత్తుల్లేకుండా
కూడా
ఓడిపోయిన
సందర్భాలు
ఉన్నాయి.
అయితే
2019కి
ముందు
పొత్లులు
పెట్టుకుని
గెలుపోటములు
చవిచూసిన
టీడీపీకి
ఆ
ఎన్నికల్లో
మాత్రం
ఒంటరిగా
పోరాటం
చేయాల్సిన
పరిస్ధితి
వచ్చింది.
ఎన్డీయే
నుంచి
తప్పుకున్న
టీడీపీకి
కమ్యూనిస్టులు,
జనసేన
కూడా
కలిసి
రాలేదు.దీంతో
ఒంటరి
పోరులో
టీడీపీ
భారీ
పరాజయం
మూటగట్టుకోవాల్సి
వచ్చింది.
అప్పటి
నుంచి
టీడీపీ
పొత్తుల్లేకుండా
గెలవలేదనే
వాదన
బలపడింది.
దీంతో
ఈసారి
ఎన్నికలకు
చాలా
ముందే
పొత్తుల
కోసం
టీడీపీ
ఆరాటపడుతోంది.
అదే
ఇప్పుడు
ప్రత్యర్ధులకూ
వరంగా
మారుతోంది.
అయితే
పొత్తుల
వల్ల
గెలుపోటములు
చూసిన
టీడీపీ
..
మిత్రపక్షాల
గురించి
ఆలోచించకుండా
సొంత
రాజకీయం
చేస్తేనే
మంచిదన్న
అభిప్రాయం
సర్వత్రా
వినిపిస్తోంది.