వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎందుకు వెనకబడ్డాం? వైసీపీలో అంతర్మథనం!!

|
Google Oneindia TeluguNews

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి 82,742 ఓట్ల మెజారిటీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. మొద‌టి నుంచి ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీ సాధించాల‌ని ముఖ్య‌మంత్రి ల‌క్ష్యాన్ని నిర్ధేశించారు. గ్రామాల‌వారీగా, మండ‌లాల‌వారీగా మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను ఇన్‌ఛార్జిలుగా నియ‌మించారు. కానీ అనుకున్న ల‌క్ష్యానికి పార్టీ ఆమ‌డ దూరంలో నిలిచిపోయింది. గెలిచాన‌న్న తృప్తిక‌న్నా అనుకున్న మెజారిటీ రాలేద‌న్న అసంతృప్తే ఆ పార్టీని వెంటాడుతోంది.

 ప‌డిపోయిన పోలింగ్ శాతం

ప‌డిపోయిన పోలింగ్ శాతం

పోలింగ్ శాతం బాగా ప‌డిపోయింది. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఓట‌ర్లు 2,13,338గా ఉన్నారు. కానీ పోలైన ఓట్లు కేవ‌లం 1,37,081గా ఉన్నాయి. అంటే 64 శాతం పోలింగ్ న‌మోదైంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోలింగ్ క‌నీసం 70 నుంచి 80 శాతం వ‌ర‌కు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంటుంది. తెలుగుదేశంపార్టీ, జ‌న‌సేన పోటీకి దూరంగా ఉండ‌టంతో ఆ పార్టీ ఓట‌ర్లు కూడా సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఓటింగ్ కు దూరంగా ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాగా ఉంది.

 బీజేపీకి, నోటాకు భారీగానే ద‌క్కాయి

బీజేపీకి, నోటాకు భారీగానే ద‌క్కాయి


బీజేపీ 19,332 ఓట్ల‌ను ద‌క్కించుకుంది. ఒక‌ర‌కంగా ఆ పార్టీకి ఓట్లు భారీగా వ‌చ్చిన‌ట్లేనని భావించవచ్చు. ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి నోటా కన్నా తక్కువ.. లేదంటే రెండు నుంచి మూడువేల ఓట్లవరకు వచ్చేవి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన ఓట‌ర్లు బీజేపీకి వేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీ సాధించి ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త లేద‌ని ప్ర‌తిప‌క్షాల‌కు నిరూపించాల‌నుకుంది. నోటాకు కూడా 4,197 ఓట్లు వ‌చ్చాయి. ఇది కూడా భారీ సంఖ్యే.

 పోలింగ్ శాతం పెంచ‌డంమీద దృష్టిసారించ‌లేక‌పోయాం!

పోలింగ్ శాతం పెంచ‌డంమీద దృష్టిసారించ‌లేక‌పోయాం!

త‌మ‌పార్టీ మీద‌, త‌మ ప్ర‌భుత్వం మీద భారీ వ్య‌తిరేక‌త ఉంద‌ని విప‌క్షాలు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, కానీ ల‌క్ష‌కు పైగా ఓట్లు సాధించి ప్ర‌జ‌ల్లో త‌మ‌మీద ఎటువంటి వ్య‌తిరేక‌త లేద‌ని దీంతో నిరూపించామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చెబుతున్నారు. పోలింగ్ శాతం పెంపుద‌ల మీద దృష్టిసారించ‌క‌పోవ‌డ‌మే పెద్ద త‌ప్పిద‌మ‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంద‌ని, ముఖ్య‌మంత్రి నిర్ధేశించిన ల‌క్ష్యాన్ని చేరుకున్న‌ట్ల‌యితే త‌మ పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవ‌ని, అయినా 82వేల‌కు పైగా మెజారిటీ సాధించ‌డంటే సాధార‌ణ విష‌యం కాద‌ని అంటున్నారు.

English summary
An interrogation in the YCP as to why the majority of one lakh votes could not be achieved in Atmakur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X