అదే కోపమా?: పవన్ కళ్యాణ్‌కు క్లియర్, చంద్రబాబే దూరం చేసుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకున్నారు! గురువారం పవన్ ట్వీట్లతో ఆయన టిడిపికి దూరమయినట్లుగా తేటతెల్లమవుతోంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకున్నారు! గురువారం పవన్ ట్వీట్లతో ఆయన టిడిపికి దూరమయినట్లుగా తేటతెల్లమవుతోంది. ఆయనను చంద్రబాబే దూరం చేతులారా దూరం చేసుకున్నారని అంటున్నారు.
పలువురు పైవిధంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు కారణం కూడా ఉంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో పవన్‌కు టిడిపిపై ఓ స్పష్టత వచ్చిందని, అందుకే ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి హోదాపై టిడిపిని విమర్శించారని అంటున్నారు.
మూడు రోజుల క్రితం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఆ భేటీలో చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోడీని ఆకాశానికెత్తారు. మోడీ పనితీరుపై చంద్రబాబు ప్రశంసించడం వరకు ఓకే.. కానీ 2019లోను మోడీ నేతృత్వంలోనే ముందుకెళ్తామని చెప్పారు.

చంద్రబాబుపై పవన్ కళ్యాణ్‌కు క్లారిటీ
ఇక్కడే పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశంపై ఓ స్పష్టత వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని, మాట తప్పిన బీజేపీపై పవన్ కళ్యాణ్ నిత్యం విమర్శిస్తున్నారు. హోదా ఇస్తామని చెబితేనే టిడిపి - బిజెపిలకు ఏపీ ప్రజలు ఓటు వేశారని చెబుతున్నారు.
అయితే, బీజేపీ ప్రత్యేక హోదాను గట్టున పెట్టింది. దీంతో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తున్నారు.

బీజేపీకి చంద్రబాబు దూరమవుతారనే ఆశలు లేవు
ఇప్పటికే ఏపీలో బీజేపీకి అంత పట్టు లేదు. ఇప్పుడు హోదాపై చేతులెత్తేయడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఏపీలో బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లేనని విపక్షాలు అంటున్నాయి. అలాంటి బీజేపీతో భవిష్యత్తులో టిడిపి ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఏపీ కొత్త రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు పదేపదే గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీకి కేంద్రం మద్దతు అవసరమని చెబుతున్నారు. అలాగే, బీజేపీ - టీడీపీల్లో కిందిస్థాయిలో అంత సామరస్యం లేదు. ఈ నేపథ్యంలో 2019 వరకు బీజేపీతో కలిసి ఉన్నా.. ఆ తర్వాత టిడిపి కమలం పార్టీకి దూరమవుతుందని చాలామంది భావించారు.

తెలుగు తమ్ముళ్ల ఆశా అదే.. కానీ
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి ఆ పార్టీకి దూరం జరగడమే మంచిదని తెలుగు తమ్ముళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం కాబట్టి చంద్రబాబు కలిసి వెళ్లడమే మేలని భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని ఆయన మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో స్పష్టం చేశారు. అంతేకాదు, నియోజకవర్గాల పునర్విభజన చేయడం ద్వారా మరో యాభై స్థానాలు పెరిగితే, టిడిపి - బిజెపికి ఎన్నికల్లో లభ్ది చేకూరుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు.

మోడీపై పవన్ కళ్యాణ్ గుర్రు
మరోవైపు, ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన బీజేపీ దానిని నెరవేర్చక పోవడంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల లెఫ్ట్ పార్టీలతో చెట్టాపట్టాల్ వేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి దూరమైతే లెఫ్ట్ - జనసేనకు టిడిపి కూడా జత కలిసే అవకాశాలను కొట్టి పారేయలేమనే వాదనలు వినిపించాయి.

టిడిపి ఎంపీలను విమర్శించినా.
ప్రత్యేక హోదా విషయంలో పవన్ ప్రధానంగా బీజేపీనే నిలదీశారు. అయితే పార్లమెంటులో టిడిపి ఎంపీల తీరును, అలాగే కమలం పార్టీతో చంద్రబాబు ఇంకా కలిసి ఉండటాన్ని పవన్ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు ఆచితూచి మాట్లాడినట్లుగా కనిపించింది. రెండేళ్ల క్రితం టిడిపి ఎంపీలను వ్యక్తిగతంగా నిలదీశారు. ఆ తర్వాత అంత ఘాటుగా మళ్లీ ఇప్పుడే నిలదీశారు.

పవన్ కళ్యాణ్ జీర్ణించుకోవడం లేదా?
ఇప్పుడు, చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్‌కు ఓ క్లారిటీ వచ్చిందని, దీంతో నేరుగా టిడిపిని కూడా ఇక టార్గెట్ చేస్తారని అంటున్నారు. హోదా ఇవ్వని బీజేపీతో వెళ్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నిరీక్షణకు రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కొంత సంయమనంతో వ్యవహరించడం ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి అవసరం, మరొకటి 2019లో టిడిపి ఆ పార్టీతో వెళ్లదని భావించడం.
ఈ కారణంగానే ఇన్నాళ్లు టిడిపి కంటే బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారని అంటున్నారు. పవన్ లేవనెత్తిన అంశాలపై టిడిపి కూడా ఇన్నాళ్లు సానుకూలంగా స్పందించింది.

టిడిపికి విమర్శ, వైసిపికి ప్రశంస
పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్లలో టిడిపిని విమర్శించి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రశంసించడం గమనార్హం. టిడిపి - బిజెపి కూటమి హోదా విషయంలో ప్రజలను మభ్య పెడుతున్నాయని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని కోరారు.
పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశంపై టిడిపి ఎంపీలు, టిడిపి కేంద్రమంత్రుల తీరు బాధ కలిగించిందని, వైసిపి ఎంపీలు మాత్రం బాగా పోరాడుతున్నారని కితాబిచ్చారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications