Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన కంటే టీడీపీయే బెటరా ? జంపింగ్ కాపు నేతల లెక్కలివే ! రాధాపై లీకుల వెనుక ?

తాజాగా బీజేపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరోసారి కాపు నేతల వ్యూహాలపై చర్చకు కారణమయ్యారు. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు జనసేన ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అధినేత పవన్ సామాజిక వర్గం కాపుల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీలకూ, జనసేనకూ పెద్ద తేడా లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు వెళ్దామనుకున్న నేతలు కూడా ఇప్పుడు టీడీపీవైపు మొగ్గుతుండటం చర్చనీయాంశమవుతోంది.

 ఏపీలో కాపు పాలిటిక్స్

ఏపీలో కాపు పాలిటిక్స్

ఏపీలో కేవలం నాలుగైదు శాతం ఓటు బ్యాంకు కలిగిన రెండు సామాజిక వర్గాలు అధికారాన్ని ఇన్నాళ్లూ క్రమం తప్పకుండా అనుభవిస్తున్న తరుణంలో వారికి ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యామ్నాయంగా కాపులు బలంగా దూసుకొస్తున్నారు. తమకు రాజ్యాధికారం ఈసారి ఎలాగైనా దక్కాల్సిందేనని భావిస్తున్న వారి దూకుడును సొమ్ము చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైసీపీ, టీడీపీ మాత్రం గతంలో ఏ సమీకరణాలు ప్రయోగించాయో ఇప్పటికీ వాటిపైనే ఆధారపడుతున్నాయి. వీటికి భిన్నంగా ఉంటుందని భావించిన జనసేన పార్టీ వారికి అధికారంపై నమ్మకం కల్పించలేకపోతుండటంతో వైసీపీ, బీజేపీ నుంచి టీడీపీలోకి మాత్రమే కాపు నేతలు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 జనసేనను కాదని టీడీపీలోకి ?

జనసేనను కాదని టీడీపీలోకి ?

రాష్ట్రంలో ప్రస్తుతం కాపు నేతల ఆధ్వర్యంలోనే జనసేన, బీజేపీ పార్టీలున్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు తెలంగాణ నుంచి దూసుకొస్తున్న బీఆర్ఎస్ సైతం కాపు మంత్రం జపిస్తోంది. అయితే బీఆర్ఎస్ తో పోలిస్తే ఇప్పటికే కాస్తో కూస్తో ఓటు బ్యాంకు కలిగిన జనసేన, బీజేపీల్లో ఏదో ఒక పార్టీవైపు కాపులు గంపగుత్తగా మొగ్గాలి. కానీ అలా జరగడం లేదు. క్షేత్రస్దాయిలో క్యాడర్ జనసేన లేదా బీజేపీ వైపు వెళ్తుంటే.. నాయకులు మాత్రం టీడీపీవైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చే విషయంలో విడివిడిగా చూసుకుంటే జనసేన కంటే టీడీపీయే బెటరనేది వారి భావన.
అందుకే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేత కూడా టీడీపీలోకే వెళ్లారు.

 జనసేనలో మొదలైన భయం ?

జనసేనలో మొదలైన భయం ?

కాపు సామాజికవర్గంలో నిఖార్సైన నేతగా పేరున్న కన్నా లక్ష్మీనారాయణ తాజాగా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం ఆయనకు ఏమేరకు మేలు చేస్తుందో తెలియదు కానీ.. జనసేన పార్టీని మాత్రం ఆత్మరక్షణలోకి నెట్టింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేనను కాదని, కమ్మ నేత చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని కన్నా ఎంచుకోవడం జనసేనకు మింగుడుపడటం లేదు. గతంలో చాలా సార్లు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా చివరికి టీడీపీవైపే కన్నా మొగ్గుచూపడం ఇప్పుడు జనసేనలోని ఆలోచనలో పడేసింది.

 వంగవీటిపై జనసేన లీకుల వెనుక ?

వంగవీటిపై జనసేన లీకుల వెనుక ?

తమ పార్టీలోకి వస్తారని భావించిన కన్నా లక్ష్మీనారాయణ చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్లిపోవడంతో పాటు వంగవీటి రాధా, గంటా శ్రీనివాస్ వంటి కాపు నేతలు కూడా ఆ పార్టీలోనే కొనసాగుతుండటం జనసేనకు నిరాశనే మిగులుస్తోంది. దీనికి ప్రధాన కారణం జనసేన సొంతగా అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఏమాత్రం లేకపోవడమే. దీంతో తమను కాదని భవిష్యత్తులో వైసీపీ, బీజేపీకి చెందిన ఇతర కాపు నేతలు కూడా రేపు టీడీపీలోకి వెళ్లిపోకుండా ఆపేందుకు జనసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాపు సామాజికవర్గంలో తిరిగి హైలెట్ అవుతున్న వంగవీటి రాధాను ఈసారి టీడీపీ నుంచి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆయన వెంటనే జనసేనలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో జనసేన రాధా రాకపై లీకులివ్వడం ద్వారా ఇతర కాపు నేతలు టీడీపీవైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+