బాబు ఎఫెక్ట్: జగన్-రోజాలను చూసి టిడిపి నేతలు బెదిరిపోతున్నారా?

విమాన ప్రయాణాల్లో వైసిపి చీఫ్ జగన్, ఆ పార్టీ నేతలు ఎవరైనా ఎదురైతే టిడిపి నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో గన్నవరం విమానాశ్రయంలో రోజా ఎదురుపడి మాట్లాడటంతో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని.

అమరావతి: విమాన ప్రయాణాల్లో వైసిపి చీఫ్ జగన్, ఆ పార్టీ నేతలు ఎవరైనా ఎదురైతే టిడిపి నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో గన్నవరం విమానాశ్రయంలో రోజా ఎదురుపడి మాట్లాడటంతో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇబ్బందిపడ్డట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రధానంగా అధికార పార్టీ నేతలు గన్నవరం విమానాశ్రయం వెళ్లలంటే ఒకటికి రెండుసార్లు విచారించి వెళ్తున్నారని చెబుతున్నారు. వంశీ - రోజా ఇష్యూనే కాకుండా ఇటీవల ఇలాంటి సంఘటనలో రెండు మూడు జరిగాయని గుర్తు చేస్తున్నారు.

మంత్రికి జగన్ పరామర్శ

మంత్రికి జగన్ పరామర్శ

ఇటీవల మంత్రి నారాయణ, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌లు గన్నవరం నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. విమానంలో వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

జగన్ వచ్చి..

జగన్ వచ్చి..

విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు జగన్ కూడా వచ్చారు. జగన్ వైసిపి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సత్యప్రసాద్‌లను కూడా పలకరించారు.

మరో మంత్రికీ కుశల ప్రశ్నలు

మరో మంత్రికీ కుశల ప్రశ్నలు

జగన్ వారి వద్దకు వచ్చి, బాగున్నారా అని పలకరించారు. ఆ తర్వాత మరోసారి విజయవాడ నుంచి వస్తుండగా మంత్రి పత్తిపాటి పుల్లారావు వద్దకు వచ్చి జగన్ కుశల ప్రశ్నలు వేశారంటున్నారు.

అక్కడే చిక్కు

అక్కడే చిక్కు

అయితే, ఇక్కడ తనకు ఎదురుపడ్డ టిడిపి నేతలను జగన్ పలకరించడంలో తప్పు కనిపించక పోవచ్చు. అయితే, ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్న సమయంలో ఆయా పార్టీల్లోని నేతలు మారేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ తమను పలకరిస్తే.. అనే భయం టిడిపి ఎమ్మెల్యేల్లో ఉందంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+