వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేశ్‌ను లీడర్ ఎందుకు చేయలే, చంద్రబాబు కూడా సస్పెండ్ అయ్యారు: వంశీ

|
Google Oneindia TeluguNews

చంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయననే అంగీకరించారు. కానీ చంద్రబాబుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓనమాలు నేర్పి, నేతను చేసిందనే విషయం మరచిపోవద్దన్నారు. తొలినాళ్లలో టీడీపీని విమర్శించిన చంద్రబాబు.. తర్వాత ఆ పార్టీనే తప్పుపట్టే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.

ఎన్టీఆర్‌పై విమర్శలు

ఎన్టీఆర్‌పై విమర్శలు

తన మామ, దివంగత ఎన్టీఆర్ గురించి కూడా చేసిన విమర్శలు మరచిపోయారా అని వంశీ ప్రశ్నించారు. రంగులేసుకొని వారు రాజకీయాలు చేయలేరనే విషయాన్ని నొక్కి వక్కానించారు. అమ్మ చెబితే ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచిన విషయం మరిచారా అని అడిగారు. పార్టీలో చొరబడి, మంత్రి పదవీ చేపట్టి.. చెప్పుచేతల్లోకి తీసుకున్నది మరచిపోయారా అని నిలదీశారు.

ఆస్తులు లేవు

ఆస్తులు లేవు

తెలంగాణలో తనకు ఆస్తి ఉంది అని ప్రకటించానని చెప్పానా అని వంశీ ప్రశ్నించారు. రుజువు చేస్తే ఈ క్షణమే పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ మీదననే చెప్పారు. 2009లో తారక్, 2014 పవన్ కల్యాణ్ ప్రచారం చేసినవారు రంగులేసుకోలేరా అని ప్రశ్నించారు.

బాబు కూడా..

బాబు కూడా..

పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. చంద్రబాబు కూడా సస్పెన్షన్‌ గురైన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సస్పెండ్ చేయలేదా అని నిలదీశారు. లోకేశ్‌ను ఎందుకు రాజకీయ నేతను ఎందుకు చేయలేదు అని అడిగారు. టికెట్లు ఇచ్చిన వారంతా నేతలవుతున్నారా అని వంశీ అడిగారు.

మారిన మాట

మారిన మాట


రాజేంద్రప్రసాద్ చేత తిట్టించింది చంద్రబాబు కాదా అని వంశీ అడిగారు. ఎందుకు తిట్టవని అడిగితే లైన్‌లో లేవని అనుకున్నానని రాజేంద్రప్రసాద్ తనతో చెప్పాడని పేర్కొన్నారు. మీరు ఏం చేసినా, తిట్టినా పడి ఉండాలా ? అని వంశీ అడిగారు. రైతుల కోసం రూ.6 కోట్లతో మోటర్లు పెట్టించానని వంశీ గుర్తుచేశారు. ఏపీలో తనకు ఎకరాం భూమి లేదు, సెంట్ స్థలం లేదని వంశీ స్పష్టంచేశారు. గ్రాము బంగారం కూడా లేదని చెప్పారు.

English summary
vamsi criticize tdp chief chandrababu naidu. why dont made lokesh as leader he asks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X