వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త సంసారానికి పనికిరాడని కృష్ణానదిలో భార్య వినూత్న నిరసన దీక్ష

|
Google Oneindia TeluguNews

భర్త సంసారానికి పనికిరాడని తెలిసి ఓ భార్య వినూత్న నిరసనకి దిగింది. చందర్లపాడు మండలం ఏటూరు కృష్ణా నదిలో తన భర్త సంసారానికి పనికిరాడని, ఆ విషయం తెలిసి కూడా తనకు పెళ్లి చేశారని, తనను మోసం చేశారని, తన భవిష్యత్ ను నాశనం చేశారని ఆరోపిస్తూ బాధితురాలు తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టింది.

భర్త సంసారానికి పనికిరాడని తెలిసి భార్య షాక్ .. బెదిరించిన అత్తమామలు

భర్త సంసారానికి పనికిరాడని తెలిసి భార్య షాక్ .. బెదిరించిన అత్తమామలు


ఏటూరు వద్ద కృష్ణానదిలో భర్తపై ఆయన కుటుంబ సభ్యులపై భార్య దీక్ష చేపట్టిన ఘటన చోటు చేసుకుంది. తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసి తనకు పెళ్లి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు పెళ్లి అయిన తరువాత మూడు రాత్రులు కూడా భర్త తన వద్దకు రాకుండా ఉండటంతో ఈ విషయం తన అత్తమామలకు చెప్పానని, అయితే ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని, అలా చెప్తే తమ పరువు పోతుందని అత్తమామలు బెదిరింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది.

 విడాకులకు వెళ్ళిన భార్య.. భరణం ఇస్తామన్న అత్తామామలు .. ఆపై వేధింపులు

విడాకులకు వెళ్ళిన భార్య.. భరణం ఇస్తామన్న అత్తామామలు .. ఆపై వేధింపులు

భర్త తీరు మారకపోవటంతో తనకు విడాకులు కావాలని అడిగానని నవ్యత పేర్కొంది. అయితే గ్రామ ప్రజల సమక్షంలో అత్తమామలు విడాకులు ఇవ్వటానికి అంగీకరించి చివరకు పదిహేను లక్షల రూపాయల డబ్బు ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొంది. డబ్బులు ఇవ్వకుండా తమపై కోర్టుకు వెళ్లి తమను, తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పేర్కొంది. అంతేకాదు తమపై పరువు నష్టం దావా వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు తమకు న్యాయం జరిగే వరకు కృష్ణా నదిలో నీళ్ళు తాగి నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు.

భర్త , అత్తగారి కుటుంబం నుండి రక్షణ కావాలని, న్యాయం కోసం బాధితురాలి దీక్ష

భర్త , అత్తగారి కుటుంబం నుండి రక్షణ కావాలని, న్యాయం కోసం బాధితురాలి దీక్ష


భర్త కొంగర నరేంద్రనాథ్, ఆయన తండ్రి మోహన్ మూర్తి, తల్లి కొంగర రూపవాణి, చెల్లెలు కంటమనేని మధురవాణి, అల్లుడు కంటమనేని విద్యాసాగర్ వీరి ఐదుగురి చేతిలో ఆ ఇంటికి కోడలిగా వెళ్లి మోసపోయానని తనకు న్యాయం చేయాలంటూ నవ్యత డిమాండ్ చేస్తుంది. ఒక బ్యానర్ పెట్టుకుని కృష్ణా నది ఒడ్దున ఇసుకలో కూర్చుని కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణానది సాక్షిగా దీక్షకు దిగింది. పోలీసులు నరేంద్రనాథ్ కు సహకరిస్తున్నారని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నవ్యత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

న్యాయం కోసం కృష్ణానది నీళ్ళు తాగి నిరసన దీక్ష చేస్తానన్న బాధిత మహిళ

ఎలాగైనా తమకు న్యాయం జరిగే వరకు కృష్ణానది వద్దనే ఆందోళన చేస్తామని, కృష్ణా నది నీళ్లు తాగి నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ్యత డిమాండ్ చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా కృష్ణా నది వద్ద దీక్షకు దిగిన ఈ బాధితురాలు, ఆమె కుటుంబం వ్యవహారంపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

English summary
In eturu Krishna river in Chandralapadu mandal a wife staged an innovative protest in the river Krishna saying that her husband is impotent. A woman named Navyata along with her family in a protest demanding justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X