ప్రియుడితో కలిసి భర్తను చంపి శవాన్ని చేపలచెరువులో పడేసింది

హైదరాబాద్: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన సోమవారంనాడు కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ సంఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ మీడియాకు వివరించారు.

కైకలూరు మండలం వరాహపట్నానికి చెందిన లక్ష్మినరసింహస్వామికి విజయలక్ష్మితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం సూరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Wife kills husband in Krsishna district

దాంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. వారు విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆమె సూరితో సహజీవనం చేస్తోంది. ఎలాగైనా భర్తను చంపేయాలని పథకం రచించిన విజయలక్ష్మి ప్రియుడు సూరి, మరో వ్యక్తి శ్రీనివాస్‌లతో కలిసి లక్ష్మినరసింహ స్వామిని చంపి చేపల చెరువులో పడేశారు.

లక్ష్మీనరసింహ స్వామి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+