వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం తురకపాలెంలో దాదాపు ఇరవై రోజుల క్రితం మృతి చెందిన సుభానీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. భార్యతోపాటు ప్రియుడు హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
భర్త ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో, భర్త పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కళాశాల బస్సు దగ్ధం
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి సమీపంలో పాలకొల్లు ఆదిత్య కళాశాలకు చెందిన బస్సు విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సులో ఎక్కాల్సిన విద్యార్థులను డ్రైవరు వేరే బస్సులో ఎక్కించి మరో చోట విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా మలుపు వద్ద విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేశారు.
ఔటర్ రింగు రోడ్డులో ప్రమాదం
రాజేంద్ర నగర్ హిమయత్ సాగర్ వద్ద ఔటర్ రింగు రోడ్డు పైన లారీని ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications