వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చేసింది
ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టింది భార్య, ఐదు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకొంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసింది భార్య.ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.
అనంతపురం: ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టింది భార్య, ఐదు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకొంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసింది భార్య.ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.
అనంతపురం జిల్లాలోని ధర్మవరం పోతుకుంట బీసీ కాలనీకి చెందిన నరేంద్ర అనే వ్యక్తిని అతని భార్య హత్య చేసింది. వేరే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది.

ప్రియుడి సహయంతో ఆమె భర్తను హత్య చేసింది.మృతదేహన్ని పూడ్చిపెట్టింది. అయితే ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. అయితే ఆదివారం నాడు ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆమె లొంగిపోయిన తర్వాత ఈ హత్య విషయం వెలుగుచూసింది.
కట్టుకొన్న భర్తను హత్య చేసి మృతదేహన్ని పూడ్చి పెట్టిన ఐదు రోజులు కావస్తోంది. ఎక్కువ రోజుల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచలేమని భావించిన నిందితురాలు పోలీసులకు లొంగిపోయింది.












Click it and Unblock the Notifications