ప్రియుడి మోజులో.. భర్త హత్యకు ప్లాన్.. దొరికిపోవడంతో చితక్కొట్టేశారు..

ప్రియుడి మోజులో భర్తనే హతమార్చాలని చూసిన ఓ భార్యకు గ్రామస్తులు దేహశుద్ది చేశారు.

చిత్తూరు: వివాహేతర సంబంధం ఓ కాపురంలో చిచ్చుపెట్టింది. ప్రియుడి మోజులో భర్తనే హతమార్చాలని చూసిన ఓ భార్యకు గ్రామస్తులు దేహశుద్ది చేశారు. ప్రియుడితో పాటు చెట్టుకు కట్టేసి చితకబాదారు.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నెకు చెందిన బాబుకు సుగుణ(28) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

నిమ్మనపల్లె మండలం దేవళం కురవపల్లెకు చెందిన పొన్నయ్య(28) అనే భవన నిర్మాణ మేస్త్రీ వద్దకు సుగుణ పనికి వెళ్తుండేది. ఈ క్రమంలో వీరద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

 Wife planned husbands murder with boyfriend

విషయం సుగుణ భర్త భాబుకు తెలియడంతో.. అతను వీరిద్దరిని మందలించాడు. అయినా తీరు మార్చుకోని వీరిద్దరు.. బాబునే అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఇందుకోసం ఓ పథకం కూడా రచించారు.

ఇదే క్రమంలో.. ఆదివారం రాత్రి పొన్నయ్య తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాబు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాడు. ఇదే అదునుగా భావించి.. తలగడతో అతని ముఖంపై గట్టిగా అదిమిపట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడు పొన్నయ్య.

అయితే బాబు గట్టిగా ప్రతిఘటించడంతో.. పొన్నయ్య, సుగుణ ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లి దాక్కున్నారు. అనంతరం బాబు కేకలతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సుగుణను, పొన్నయ్య ఇంటినుంచి బయటకు ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టేసి చితకబాదారు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఎస్ఐ రవిప్రకాశ్ కేసు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+