ఆడపిల్ల పుట్టిందని భార్యను కాదన్న టెక్కీ

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి భార్యను వదిలి వేసిన సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. అతను సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

ఎస్సీ హాస్టల్‌లో 12 మంది విద్యార్థినులకు అస్వస్థత

రాజమండ్రిలో ఓ ఎస్సీ బాలికల హాస్టల్‌లో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో కలుషితాహారం తినడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Wife stages dharna at husband's residence

భారీగా గంజాయి స్వాధీనం

విశాఖపట్నం రోలుగుంట మండలం వడ్డిపా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేసి 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఓ వ్యాన్‌ను సీజ్ చేశారు.

నెల్లూరులో భారీ చోరీ

నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి రిటైర్డ్ తహసీల్దార్ ఇంట్లో దొంగలు ప్రవేశించి లక్ష రూపాయల విదేశీ కరెన్సీ, భారీగా వెండి, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి హైదరాబాద్ వెళ్లినట్టు దొంగలు పసిగట్టి చోరీకి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+