ఎవరితోనైనా కలుస్తా: మోడీకి జగన్ సంకేతమా?
హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎకు మద్దతు ఇస్తానంటూ చెబుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాట మార్చారు. కేంద్రంలో తాను ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు. అంటే, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెతో కూడా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు. మతతత్వ పార్టీ బిజెపితో కలవబోనని చెప్పిన ఆయన సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిని తానే అవుతానని కూడా ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు తెలిసింది. దీంతో సీమాంధ్రను సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి అప్పుడే ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నారని సమాచారం. ఆధునిక సింగపూర్ నిర్మాణానికి పునాదులు వేిసన లీ కౌన్ యేవ్ ఆత్మకథను ఆయన చదువుతున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే తాను ప్రపంచస్థాయి సంస్థలను సంప్రదిస్తున్నట్లు ఆయన చెబుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై కూడా ఆయన స్పష్టత ఉందట. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడంపై తనకు ఆలోచన ఉందని చెబుతున్నారని సమాచారం. అయితే, ఆ ప్రాంతమేదో చెప్పడానికి ఆయన నిరాకరిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ రాజధాని కోసం ప్రాంతాన్ని గుర్తించే వరకు ఆ విషయాన్ని వెల్లడించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రను సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమవుతుందని, అందుకు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వారితో కలిసి పనిచేస్తానని వైయస్ జగన్ అన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications