• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో ప్లస్సా ? మైనస్సా ? పవన్ అంతర్మథనం ! కీలక సమీకరణాలివే.. ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రధాని మోడీ వైజాగ్ టూర్ తర్వాత ఓ కీలక చర్చ జరుగుతోంది. ప్రధాని టూర్ కు ముందు మొదలైన ఈ చర్చ మోడీ-పవన్ భేటీ తర్వాత మరింత ముదిరింది. అది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ పొత్తు పెట్టుకోవాలా వద్దా ? పెట్టుకుంటే పవన్ కు జరిగే లాభమెంత, నష్టమెంత ? పవన్ గత ఎన్నికల తరహాలోనే ఒంటరిగా పోటీ చేయాలా లేక కేంద్రం మద్దతు ఉన్నందున బీజేపీతో కలిసి పోటీ చేస్తే జరిగే మేలెంత ? సీఎం అభ్యర్దిగా తనను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీని కాదని, చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న అపవాదు భరించడం అవసరమా అనేది ఈ చర్చ సారాంశం.

పవన్-చంద్రబాబు భేటీతో..

పవన్-చంద్రబాబు భేటీతో..

మూడేళ్లుగా బీజేపీతో కలిసి సాగుతున్న ఎదుగూబొదుగూ లేకుండా పోవడం, వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లేందుకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో విశాఖలో పవన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ విశాఖ గర్జన తర్వాత మారిన పరిస్ధితుల్లో అక్కడికి వెళ్లిన పవన్ ను పోలీసులు అడ్డుకోవడం, హోటల్ కే పరిమితం చేయడం వంటి కారణాలతో వేడి మరింత పెరిగింది. దీంతో విజయవాడ తిరిగి వచ్చేసిన పవన్ ను నోవోటెల్ హోటల్లో చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన చర్చలు, అనంతరం వీరిద్దరూ చేసిన ప్రకటనలతో రాజకీయం మరింత వేడెక్కింది.

 ఒక్క రోజులో మారిన రాజకీయం

ఒక్క రోజులో మారిన రాజకీయం

విశాఖ నుంచి తిరిగి రాగానే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి వైసీపీ సర్కార్ పై నిప్పులు కక్కిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. వైసీపీ సర్కార్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఎవరినీ వదలకుండా బూతులతో రెచ్చిపోయారు. దీంతో వైసీపీ కూడా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. పవన్ పై ఎదురుదాడికి మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగినా అంతగా ఫలించలేదు. అనంతరం అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించడం, ఇద్దరూ కలిసి పోరాడతామని ప్రకటించడంతో సీన్ మొత్తం మళ్లీ మారిపోయింది.

పవన్ దూకుడుకు మోడీ బ్రేక్ ?

పవన్ దూకుడుకు మోడీ బ్రేక్ ?


రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదనే కారణంతో తిరిగి టీడీపీ పంచన చేరేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారన్న సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోడీ వైజాగ్ వచ్చారు. పేరుకు శంఖుస్ధాపనల కార్యక్రమం పెట్టుకుని ఒక రోజు ముందే విశాఖ వచ్చిన ప్రధాని వచ్చీ రాగానే పవన్ తో భేటీ కావడంతో జనసేనాని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ భేటీలో ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై దూకుడు తగ్గించమని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతానికి బీజేపీ-జనసేన పొత్తు మాత్రమే కొనసాగించాలని కోరారు. చంద్రబాబుతో పొత్తుపై తర్వాత ఆలోచిద్దామని సూచించినట్లు తెలిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ అంతర్మథనంలో పడ్డారు.

 పవన్ కు పెరుగుతున్న ఆదరణ

పవన్ కు పెరుగుతున్న ఆదరణ

రాష్ట్రంలో మారిన పరిస్ధితుల్లో జనసేనకు క్షేత్రస్ధాయిలో ఆదరణ పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావాన్ని సొమ్ము చేసుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం తప్పిదాలు చేస్తున్నా వాటిని రాజకీయం చేయకుండా నిర్మాణాత్మకంగా పోరాడే విషయంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. అన్నింటికంటే మించి పవన్ లేకుండా తాము పోటీ చేయలేమన్నట్లుగా రక్షణాత్మక ధోరణిలోకి చంద్రబాబు వెళ్లిపోతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పవన్ భేటీ, ప్రధాని మోడీ కూడా విశాఖ రాగానే పవన్ తో భేటీ కావడం వంటి పరిణామాలతో పవన్ సత్తా ఏంటో మిగతా పార్టీలకు తెలిసివస్తోంది.

చంద్రబాబుతో పవన్ కు ప్లస్సా ? మైనస్సా

చంద్రబాబుతో పవన్ కు ప్లస్సా ? మైనస్సా

తాజా పరిస్ధితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గతంలోలా ఒంటరిగా పోటీ చేయడం, లేదా బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా టీడీపీ-బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా కేవలం టీడీపీతో మాత్రమే కలిసి వెళ్లడం ఉన్నాయి. వీటిలో ఒంటరి పోటీ అసాధ్యమే. అలాగే బీజేపీని వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే కలిసి పోటీ చేయడం కూడా అసాధ్యమే. దీంతో టీడీపీ-బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీని ప్రస్తుతానికి వదిలేసి రమ్మని అడుగుతోంది. దీంతో పవన్ చంద్రబాబుతో కలిసి వెళ్లడం ప్లస్సా లేక మైనస్సా అనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ మూడేళ్ల పాలన తర్వాత ఆ పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ కంటే జనసేనే ముందుందున్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఆలోచనలు మారుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా పవన్ కు సీఎం పదవి కనీసం షేరింగ్ విధానంలో అయినా ఇవ్వకపోతే చంద్రబాబుతో కలిసి వెళ్లడం అనవసరం అనే భావనలో ఉన్నారు. పవన్ సీఎం అవుతారంటేనే ఈసారి జనసేన నేతలు, కార్యకర్తలు దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ చెప్పినట్లుగా చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పవన్ వ్యూహాలు ఈ దిశగా ఉండాలనే వాదన పెరుగుతోంది.

English summary
with recent political developments in ap, now jansena chief pawan kalyan is in dilemma to go with chandrababu or not in 2024 polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X