వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ ఎపిసోడ్- చంద్రబాబుకు సంకేతాలు పంపిన జగన్- సవాల్ స్వీకరిస్తారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంతో జగన్ పంపిన సంకేతాలు ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలై ఆ తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటున్న నారాయణను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసే దాకా వెళ్లడం వెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Andhra Pradesh: క‌థ‌నాలు చూసి ఉద్రేక‌ప‌డుతున్న AP CM Jagan? | Telugu Oneindia
 మాజీ మంత్రి నారాయణ అరెస్టు

మాజీ మంత్రి నారాయణ అరెస్టు

పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజ్, మాల్ ప్రాక్టీస్ కేసుల్లో మాజీ మంత్రి నారాయణను వైసీపీ సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగానే తొలిరోజే ఈ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగుచూసింది. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని ఖండిస్తూ వచ్చింది. అసలు పేపర్ లీక్ కాలేదని, మాల్ ప్రాక్టీస్ కూడా జరగలేదంటూనే దాదాపు 60 మందికి పైగా టీచర్లు, ఇతరుల్ని అరెస్టు చేసిన సర్కార్.. చివరికి ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను టార్గెట్ చేసి అరెస్టు చేసింది. అదీ ఆయన కుమారుడు నిషిత్ నారాయణ వర్దంతి కూడా జరుపుకోనీయకుండా అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

వైసీపీ పాత టార్గెట్ నారాయణ

వైసీపీ పాత టార్గెట్ నారాయణ

వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచి అప్పట్లో మంత్రిగా ఉన్న పొందూరు నారాయణపై కన్నుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఆర్ధిక స్తంభాల్లో కీలకమైన నారాయణ దశాబ్దాలుగా వారిని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే 2014లో టీడీపీ విజయం తర్వాత మాత్రమే ఆయన నేరుగా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన రాజకీయాల్లో నేరుగా కనిపించింది లేదు. కానీ 2014లో టీడీపీ విజయం తర్వాత ఒక్కసారిగా మున్సిపల్ మంత్రిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అప్పటికే టీడీపీకి ఆర్ధికంగా ఆయన అందించిన అండదండలు ఆపార్టీ రాజకీయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికీ తెలుసు. అలాగే విపక్షాలకు కూడా. ఆయన్ను టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు ఆర్ధికమూలాల్ని దెబ్బకొట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

 చంద్రబాబుకు జగన్ సంకేతం

చంద్రబాబుకు జగన్ సంకేతం

వైసీపీ చేతిలో 2019లో టీడీపీ దారుణ పరాజయం తర్వాత చంద్రబాబుకు అతిపెద్ద సవాల్ తన ఆర్దిక మూలాల్ని కాపాడుకోవడమే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా ఈ మూడేళ్లలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ఆర్ధిక స్తంభాల్లో ఒకటైన నారాయణపై వైసీపీ ప్రయోగించిన అరెస్టు అస్త్రం చర్చనీయాంశంగా మారింది. మూడేళ్లుగా చంద్రబాబు ఆర్ధిక స్తంభాల్లో భాగమైన రియల్ ఎస్టేట్, ప్రాజెక్టులు, మద్యం వంటి రంగాల్లో భారీ దెబ్బలే తీసిన జగన్ ఈసారి నారాయణ అరెస్టుతో భారీ దెబ్బ కొట్టడం ఖాయమనే సంకేతాలు పంపారు. దాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఆయన భవిష్యత్తు కూడా ఆధారపడబోతోంది.

చంద్రబాబు తట్టుకుంటేనే ?

చంద్రబాబు తట్టుకుంటేనే ?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఆర్ధికమూలాల్లో భాగమైన పలు అంశాల్ని ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్న జగన్ ఈసారి కీలకమైన నారాయణపై దృష్టిపెట్టారు. ఇన్నాళ్లూ ఆయన విద్యాసంస్ధల్ని వదిలేసిన జగన్.. వచ్చే ఎన్నికలకు కీలకమయ్యే ఆయన నిధుల్ని అడ్డుకునేందుకు నారాయణను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పైకి టెన్త్ పేపర్ల లీకేజ్ వ్యవహారం కనిపిస్తున్నా, విద్యాసంస్ధల్లో అక్రమాలను టార్గెట్ చేయడం ద్వారా ఆయన్ను చంద్రబాబుకు దూరం చేయాలన్న వ్యూహమే ఇందులో కనిపిస్తోంది. మరోవైపు నారాయణ తన విద్యాసంస్ధలకు ఛైర్మన్ కాదన్న కారణంతో బెయిల్ పొందినా ఆ విద్యాసంస్ధల నుంచి నారాయణకు వచ్చే నిధుల్ని, తద్వారా చంద్రబాబుకు వచ్చే నిధుల్ని ఆపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం అడుగులు ఉండబోతున్నాయి. మరి తన ఆర్ధిక మూలాల్ని చంద్రబాబు కాపాడుకుంటారా లేదా అన్న దానిపైనే రేపు ఎన్నికల్లో టీడీపీ అవకాశాలు కూడా ఆధారపడబోతున్నాయి.

English summary
ysrcp govt's arrest of former minister narayana has seems to be a part of its diversion politics amid oppositon tdp-janasena tie up plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X