• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబును కోర్టుకీడుస్తాం, దొంగచూపు: కెసిఆర్

By Pratap
|

హైదరాబాద్: శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారని, అహంకార ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం రాత్రి కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీశైలం విషయంలో చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబును విడిచిపెట్టేది లేదని, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చంద్రబాబు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీలేరును తమ నుంచి లాక్కున్నారని, కృష్ణపట్నంలో తాము వాటాదారులం అని ఆయన చెప్పారు. ఇప్పుడు చెబుతున్న విషయాలలో ఏ ఒక్కటైనా తప్పు అని అంటే నేల మీద ముక్కు రాస్తానని కెసిఆర్ సవాలు విసిరారు. విద్యుత్‌ వాటాలకు సంబంధించి చంద్రబాబు చర్చకు రమ్మంటున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రమ్మనండి, అబిడ్స్‌లోనే చర్చిద్దాం అని ఆయన అన్నారు. కావాలంటే విజయవాడ కూడా వస్తానంటూ ప్రకాశం బ్యారేజిపైనే చర్చిద్దాం, ప్రజలకు అన్నీ తెలుస్తాయని ఆయన అన్నారు.

KCR

తాను పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రిని అనే గౌరవం కూడా లేకుండా ముందు చూపు లేదని తనపై చంద్రబాబు మాట్లాడారని, తనకు చంద్రబాబులాగా దొంగ చూపు లేదని కెసిఆర్ అన్నారు. శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనంటూ అది నాలుకా, తాటిమట్టా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ఎత్తుకున్న పంథాను ఆయన రాష్ట్రానికే చెందిన ఇఆర్‌సి చెంపపెట్టు పెట్టిందని,

చంద్రబాబు కుట్రలను ఏపి ఇఆర్‌సి బయటపెట్టింది కాబట్టే ఆ అధికారులను బదిలీ చేశారని కెసిఆర్ ఆరోపించారు. చంద్రబాబు తన అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను, రైతులను, డ్వాక్రా మహిళలనూ మోసం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా దాపురించారని, చట్టబద్దంగా తమ రాష్ట్రానికి రావాల్సిన కరెంట్ రాకుండా అడ్డుకుంటూ ఇక్కడి పంటలను ఎండబెట్టి ఎడారిగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసి, తానే అరిచి గోల పెడుతున్నారని, సిగ్గూలజ్జ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడుతామని, రావాల్సిందంతా ముక్కు పిండి వసూలు చేస్తామని, కోర్టులో జరిమానా కూడా వేస్తారని, అప్పుడు చంద్రబాబు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో ఆలోచించుకోవాలని కెసిఆర్ అన్నారు.

కేంద్ర మంత్రి ఉమా భారతికి చెప్పించి కృష్ణా బోర్డు చైర్మన్‌ను పిలిపించి నానా యాగీ చేస్తున్నారని, చంద్రబాబు కుతంత్రాలకు లొంగేది లేదని, శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి ఆపేది లేదని, 834 అడుగుల మట్టం చ్చే వరకు ఉత్పత్తి సాగిస్తామని కెసిఆర్ చెప్పారు. జరిగిన విద్యుదత్పత్తి, అందులో తెలంగాణకు రావాల్సిన వాటాకు సంబంధించిన లెక్కలను కెసిఆర్ వివరించారు. చంద్రబాబు మొత్తం కరెంట్ కొట్టేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The TRS government will be filing a Special Leave Petition in the Supreme Court early next week against the alleged injustice being meted out to the state by the neighbouring Andhra Pradesh Government which it says, has been violating the power sharing formulae envisaged in the AP Reorganisation Act and has been denying its legitimate share from Lower Sileru, Vizag Hinduja and Krishnapatnam power plants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more