తారక్ ఫ్యాన్స్ మద్దతెవరికి - పవన్ వ్యూహాలు ఫలిస్తాయా..!!

ఏపీలో రానున్న ఎన్నికలు పార్టీలకు నవ్ ఆర్ నెవర్ గా మారాయి. దీంతో సీఎం జగన్..చంద్రబాబు...పవన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో పవన్ ఫ్యాన్స్ కూడా వైసీపీకే ఓటు వేసారని పలు సభల్లో స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా నందమూరి ఫ్యాన్స్ టీడీపీకి మద్దతుగా నిలుస్తారు. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా చేయటం పైన గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి.

టీడీపీకి దూరంగా తారక్ : 2009 ఎన్నికల సమయంలో టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత క్రమేణా పార్టీ వ్యవహారాలకు దూరం అయ్యారు. కేవలం సినిమాలపైనే ఫోకస్ చేసారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అటు బీజేపీ, ఇటు పవన్ తో పొత్తు ఖాయం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత కూడా తారక్ కు పార్టీలో ప్రాధాన్యత లేదు. ఇక, 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత టీడీపీ అభిమానులుగా ఉన్న తారక్ ఫ్యాన్స్ చంద్రబాబు పాల్గొన్న పలు సభల్లో తిరిగి తారక్ ను పార్టీలోకి తీసుకురావాలంటూ నినాదాలు చేయటం..ఫ్లెక్సీలు ప్రదర్శించారు. చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ ను ఆహ్వానించినా హాజరు కాలేదు. దీనిని కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసారు.

 tharakfans

చంద్రబాబు సభల్లో ఫ్యాన్స్ నినాదాలు : అసెంబ్లీ పరిణామాలు..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి సందర్భాలతో పాటుగా రాజధాని రైతులు నేరుగా తారక్ పైన విమర్శలు చేయటం జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ ను ఆహ్వానించిన తారక్ ను పిలవకపోవటం పైనా అక్కడ అభిమానులు నినాదాలు చేసారు. హైదరాబాద్ లో సభకు పవన్..తారక్ ను ఆహ్వానించినా ఇద్దరూ వెళ్లలేదు. ఇక.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, పవన్ మధ్య పొత్తు ఇప్పటికే దాదాపు ఖాయమైంది. ఎన్టీఆర్ మనవడుగా..పార్టీ కోసం పని చేసిన వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటం పైన తారక్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ ను కలవటం..జనసేనాని మద్దతు కోరటం వంటి అంశాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.

తారక్ ఫ్యాన్స్ మద్దతెవరికి : ఈ క్రమంలో తాజాగా కాకినాడ సర్పవరం సభలో పవన్ కల్యాణ్ తాను సినీ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖ హీరోల పేర్లు ప్రస్తావించారు. వారందరూ కలిస్తేనే తెలుగు సినీ పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, రాం చరణ్ పేర్లను ప్రస్తావన చేసారు. పవన్ ప్యాన్స్ తమ హీరో సీఎం కావాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా కొద్ది నెలల క్రితం పవన్ కు మద్దుత ప్రకటించారు. తరువాత పొత్తు అంశాలు తెర మీదకు వచ్చాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి మద్దతు పొందేందుకు కొద్ది రోజుల క్రితం లోకేశ్..ఇప్పుడు పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ-పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. మరి..తమ హీరోకు ప్రాధాన్యత దక్కని పార్టీ..మద్దతిస్తున్న పార్టీకి వారు అండగా నిలుస్తారా లేదా.. ఎన్నికల లోగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+