పదేళ్లుగా పవన్ కళ్యాణ్ కు దొరకని ఏపీ ప్రజలనాడి కేసీఆర్ కు దొరుకుతుందా?

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పదేళ్లుగా పవన్ కళ్యాణ్ కు దొరకని ఏపీ ప్రజలనాడి కేసీఆర్ కు దొరుకుతుందా అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేక కొత్త చర్చలకు కారణంగా మారింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ సాధించలేనిది, ఇటీవల బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించగలుగుతారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

పదేళ్ళుగా ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ పోరాటం

పదేళ్ళుగా ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ పోరాటం

గత పది ఏళ్లుగా ఏపీలో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తే ఒక్క స్థానంలోనే విజయం సాధించినా, ఆ ఒక్క స్థానంలో గెలిచినటువంటి నేత కూడా జనసేనకు షాక్ ఇచ్చి వైసిపి భజన మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం, వారి పక్షాన పోరాటం చేయడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు అన్న విషయాన్ని ఆయన నిన్న సభా వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఏపీలో ప్రధానంగా ఆ సమస్య ఉందన్న పవన్ .. కేసీఆర్ సక్సెస్ అవుతారా?

ఏపీలో ప్రధానంగా ఆ సమస్య ఉందన్న పవన్ .. కేసీఆర్ సక్సెస్ అవుతారా?

ఏపీలో ప్రజల మధ్య సఖ్యత లేదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఏపీ ప్రజల మధ్య ఉమ్మడి అజెండా లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య కామన్ ఎజెండాగా తెలంగాణ ఉందని, కానీ ఏపీ ప్రజల మధ్య కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, ఏపీ ప్రజలపై కుల రాజకీయాల ప్రభావం ప్రధానంగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఈ సమయంలో ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ రాజకీయంగా సక్సెస్ అవుతారా అన్న కొత్త చర్చ జరుగుతుంది.

ఏపీ ప్రజల మద్దతు కూడగట్టటం కేసీఆర్ కు కత్తి మీద సామే

ఏపీ ప్రజల మద్దతు కూడగట్టటం కేసీఆర్ కు కత్తి మీద సామే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోలా రాజకీయాలు చేస్తే ఏపీలో వర్కౌట్ కాదు అన్న అభిప్రాయం తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఏపీలో బీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగుతుంది అని ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ ప్రజల మద్దతు కూడగట్టటం కత్తి మీద సామే. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ ఉందని అందువల్లే కెసిఆర్ సక్సెస్ అయ్యారని, కానీ ఆంధ్ర ప్రజలలో సెంటిమెంట్ కన్నా కులమే ఎక్కువ డామినేట్ చేస్తుందని, అటువంటి చోట కెసిఆర్ ఏపీలో కుల రాజకీయాలు చేయక తప్పదని, అలాంటప్పుడు ఆయన ఏ కులం పై ఎక్కువగా ఫోకస్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఏపీలో సెంటిమెంట్ తో వెళ్తారా? కుల రాజకీయాలతోనే కేసీఆర్ వెళ్తారా?

ఏపీలో సెంటిమెంట్ తో వెళ్తారా? కుల రాజకీయాలతోనే కేసీఆర్ వెళ్తారా?

ముఖ్యంగా కాపులను కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అందుకే కెసిఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో కాపు సీఎం అంటూ ప్రచారం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా తెలంగాణ ప్రజల ఆలోచన విధానానికి, ఏపీ ప్రజల ఆలోచన విధానానికి పెద్ద వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో కెసిఆర్ ఏపీలో రాజకీయాలు చేయడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏపీలో రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు అన్న భావన తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టంగా తెలుస్తుంది. మరి కెసిఆర్ ఏపీలో ఏపీ ప్రజలను భావోద్వేగానికి గురి చేసే సెంటిమెంట్ తో వెళతారా? లేక కుల రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ అధికారాన్ని అందించే కులాన్ని నెత్తికెత్తుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కు దొరకని ప్రజల నాడి కేసీఆర్ కు దొరుకుతుందా అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+