విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజకీయ పార్టీలకు కేసీఆర్ ఆఫర్ ! బీఆర్ఎస్ మిత్రుల్ని తేల్చే వ్యూహం ! కలిసొచ్చేదెవరు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో ఇప్పటికే ఏపీలో చర్చనీయాంశమవుతున్న పలు సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఓ కీలక సమస్యను పట్టేశారు. ఇప్పుడు అదే సమస్యపై పరిష్కారం కూడా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయ పార్టీలకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ


ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అతి త్వరలో విశాఖలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అజెండాను ఏపీ ప్రజలకు వెల్లడించబోతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ రాజకీయం ఊపందుకోబోతోంది. అయితే ఈ అజెండాలోనే కేసీఆర్ ఓ కీలక అంశాన్ని బయట పెట్టబోతున్నారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ అందరికీ తెలిసేలా చేసేందుకు ఈ అంశం ఉపయోగపడుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన హింట్ ను తాజాగా నిర్వహించిన ఖమ్మం సభలో కేసీఆర్ ఇచ్చేశారు.

వైజాగ్ స్టీల్ జాతీయీకరణ

వైజాగ్ స్టీల్ జాతీయీకరణ

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న కీలక సమస్యల్లో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కూడా ఒకటి. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం చాలా సులువుగా ప్రైవేటీకరణ చేసేస్తుంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్ధితి. మొదట్లో కార్మికుల ఆందోళనతో సంఘీభావం ప్రకటించిన జగన్, చంద్రబాబు, పవన్ వంటి వారు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. దీంతో ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకునేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే తాము తిరిగి జాతీయీకరణ చేస్తామని ఖమ్మం సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు.

ఏపీలో మిత్రుల్ని తేల్చే వ్యూహం ?

ఏపీలో మిత్రుల్ని తేల్చే వ్యూహం ?

ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాక వెనుక సీఎం జగన్ హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాపుల ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడుతోందని జనసేన, టీడీపీ విమర్శిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో కేసీఆర్ కు అసలు మిత్రులెవరన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా సీఎం జగన్ సహకారంతోనే పాతమిత్రుడు కేసీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్న చర్చ కూడా ఉంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీకి కోపం తెప్పించకుండా ఉండేందుకు మౌనంగా ఉంటూ వస్తున్న జగన్, చంద్రబాబు, పవన్ ఇప్పుడు కేసీఆర్ ఎంట్రీ చర్వాత కచ్చితంగా దానిపై మాట్లాడక తప్పని పరిస్దితి వస్తుంది. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వీరిలో ఎవరు నోరు విప్పితే వారే కచ్చితంగా బీఆర్ఎస్ మిత్రులు కావడం ఖాయం. దీంతో ఏపీలో మిత్రుల్ని తేల్చేందుకు కేసీఆర్ ఈ వ్యహం ఎంచుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కలిసొచ్చేది వీరేనా ?

కలిసొచ్చేది వీరేనా ?

అయితే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూడా లైట్ తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ రాకతో బీజేపీకి వ్యతిరేకంగా తాము నోరు విప్పాల్సిన పరిస్దితులు ఉంటాయనే విషయాన్ని వారు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సీరియస్ గా పోరాటం మొదలుపెడితే మాత్రం కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కేసీఆర్ తో కలిసి రావడం ఖాయం. ఇప్పటికే తెలంగాణాలో కమ్యూనిస్టులతో కలిసి సాగుతున్న కేసీఆర్ కు ఏపీలోనూ వారు సహజమిత్రులే అవుతారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరు కాబట్టి చేతులు కలిపే అవకాశముంది.

English summary
telangana cm kcr's latest offer on nationalisation of vizag steel plant put regional parties into a dilemma amid growing protest against privatisaiton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X