Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామా: సభలో కిరణ్ అడ్డం తిరిగితే ఏం చేద్దాం!?

హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే...? ఏం చేయాలనే దాని పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. కిరణ్ తెలంగాణకు అడ్డుపడరని చెప్పారు. బయటకు అలా చెప్పినప్పటికీ సమైక్యవాదం బలంగా వినిపిస్తున్న కిరణ్ అడ్డుపడే అవకాశాలు లేకపోలేదని అధిష్టానం అనుమానిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ బిల్లు శాసన సభలో చర్చకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తే... ఆ పరిస్తితిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోందట. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మంత్రుల బృందం కేబినెట్‌కు సమర్పించే నివేదికను చర్చించిన తరువాత బిల్లును రాష్టప్రతి ద్వారా శాసన సభకు పంపిస్తారు. శాసన సభ చర్చించి పంపించే బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది.

Kiran Kumar Reddy

పార్లమెంట్ ఆమోదం పొందిన తదుపరి రాష్టప్రతి ఆదేశంతో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావమవుతుంది. అయితే ఇదంతా శాసన సభలో బిల్లుపై చర్చ జరగటంపైనే ఆధారపడి ఉంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో కిరణ్ నిరసన ప్రకటించి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతారని కాంగ్రెస్ హైకమాండ్ అనుమానిస్తోంది. తాను సిఎంగా ఉన్నంత కాలం విభజన జరగదని కిరణ్ చెప్పిన విషయం తెలిసిందే.

విభజనను వ్యతిరేకిస్తూ, అందుకు కారణాలను వివరించటం ద్వారా సీమాంధ్ర మద్దతు, సానుభూతి సంపాదించాలన్న యోచనలో కిరణ్ ఉన్నట్టు హైకమాండ్ అంచనా వేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ఆయన కనుక పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తప్పదని భావిస్తున్నారు. కిరణ్ ప్రభుత్వం పతనమైన ఆనంతరం కొత్త నేతను సిఎంగా నియమించి ముందుకు సాగాలని అనుకున్నా సమయం సరిపోకపోవచ్చునని హైకమాండ్ భావిస్తోంది.

రాష్టప్రతి పాలన విధించటం ద్వారా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయడంపై పరిశీలన చేస్తోంది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కూడా బుధవారం రాష్ట్రపతి పాలన విధించడం ద్వారానే తెలంగాణపై ముందుకు వెళ్లవచ్చునని అభిప్రాయపడ్డారు. విభజన నిర్ణయం నేపథ్యంలో సమైక్య గళం వినిపిస్తున్న కిరణ్ ఢిల్లీకి వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాను ఎక్కడున్నా అదే గళం వినిపిస్తానని తనకు ఫోన్ చేస్తున్న ఢిల్లీ పెద్దలకు ఆయన చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో బిల్లు సభలో చర్చకొస్తే కిరణ్ ఏం చేస్తారు? ఆయన రాజీనామా చేస్తే ఏం చేయాలనే విషమయై అధిష్టానం చర్చిస్తోందట. శాసన సభలో బిల్లు సమయంలో నెలకొనే ప్రమాదకర పరిస్థితులు రాష్టప్రతి పాలనకు దారి తీయవచ్చని అంటున్నారు. రాష్ట్రం రాష్టప్రతి పాలనలోకి జారిపోతే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌కు పంపించేందుకు ప్రణబ్ ముఖర్జీ అంగీకరిస్తారా? అనేది అంశం పైన రాష్ట్ర నేతల మధ్య చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+