వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్లు, నిరాహార దీక్ష: ఒక్క ముద్రగడ.. ఎన్నో ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాపులను వెంటనే బీసీలలో చేర్చాలని పెద్ద ఎత్తున కాపులు రోడ్ల పైకి వస్తున్నారు.

చెవిలో పూవులు పెట్టుకొని, కంచాలను కొడుతూ కాపులు నిరసన తెలిపారు. ఈ సమయంలో రాజకీయ వర్గాల్లో, సామాన్యుల్లో కొత్త చర్చ సాగుతోంది. కాపుల కోసం న్యాయం అంటూ ముద్రగడ పార్టీని పెడతారా? లేక కాపు ఓట్లను టిడిపి నుంచి జగన్ కొల్లగడతారా? అనే చర్చ సాగుతోంది.

బాబు కోసమా: ఏం జరుగుతోంది.. చిరంజీవి టూర్ X పవన్ కళ్యాణ్ ట్వీట్బాబు కోసమా: ఏం జరుగుతోంది.. చిరంజీవి టూర్ X పవన్ కళ్యాణ్ ట్వీట్

Will Mudragada float new party?

ముద్రగడ దీక్ష వెనుక ప్రధానంగా... వైసిపి అధినేత జగన్ ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే, ముద్రగడకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ముద్రగడ.. జగన్‌ను కార్నర్ చేసి తమ జాతి ప్రయోజనాల కోసం కొత్త పార్టీ పెడతారా అని చాలామంది చర్చించుకుంటున్నారు.

తాను తన జాతి కోసమే జీవిస్తానని ఆయన చెప్పారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు.. కాపుల కోసం ముద్రగడ పైన పార్టీ పెట్టాలనే ఒత్తిడి రావొచ్చునని, దానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తే అది జగన్‌ను నష్టమేనని అంటున్నారు. కాగా, సోమవారం నాడు ముద్రగడతో టిడిపి నేతలు జరిపిన చర్చలు ఫలించినట్లుగా కనిపిస్తున్నాయి.

English summary
If Kapu anger coalesces around Mudragada Padmanabham, he might float a party of his won and strive to become the first Kapu CM of Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X