టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ తేల్చేస్తారా ? ముందస్తు ఊహాగానాల వేళ-క్యాడర్ డిమాండ్లివే?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ముూడేళ్లు పూర్తవుతోంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనసేన ఎన్నో పోరాటాలు చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ వైసీపీ ప్రభుత్వంపై పోరాడింది. అయినా ఆశించినంత మైలేజ్ మాత్రం దక్కలేదు. దీంతో వచ్చే రెండేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలకు జనసేన అనుసరించాల్సిన వ్యూహం ఇప్పుడే ఖరారు కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీతో పొత్తుకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చే క్లారిటీ కోసం ఆ పార్టీ క్యాడర్ ఎదురుచూస్తోంది.

పవన్ రాజకీయం
ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఓ పట్టాన ప్రత్యర్ధులకు అర్ధం కావు. సొంత పార్టీ కార్యకర్తలు అసలే అర్ధం కావన్న నానుడి ఉంది. దీనికి ప్రధాన కారణం ఆయన తీసుకునే నిర్ణయాలే. ఒకప్పుడు అక్కున చేర్చుకున్న వారినే తిరిగి ఎప్పుడు దుమ్మెత్తి పోస్తారో తెలియని రాజకీయం పవన్ ది అంటూ ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు.
అలాగే ఇవాళ విమర్శిస్తున్న వారిని ఎప్పుడు తిరిగి కౌగిలించుకుంటారో తెలియదంటా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి పవన్ కల్యాణ్ తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయి. ఇవాళ నిర్వహించబోతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ చేయబోయే ప్రసంగంలో ఆయన భవిష్యత్ రాజకీయం కళ్లకు కడతారని చెబుతున్నారు.దీంతో పార్టీ క్యాడర్ తో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

టీడీపీతో పొత్తుపై క్లారిటీ
ప్రస్తుతం బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడు ఆ పార్టీని వదిలేస్తారో తెలియని పరిస్ధితి.ఎందుకంటే ఇప్పటికీ బీజేపీతో కలిసి ఉమ్మడిగా ఆయన చేస్తున్న పోరాటాలు చూస్తే వేళ్ల మీద లెక్క బెట్టవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో టీడీపీతో కలిసి మరోసారి ముందుకు సాగే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. దీని వెనుక పలు కారణాలు కూడా లేకపోలేదు.
ఇప్పటికే ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీతో జనసేన క్షేత్రస్ధాయిలో పొత్తులు కుదుర్చుకుని అధికార వైసీపీకి పలు చోట్ల షాకులిచ్చింది. అదే రాష్ట్రస్ధాయిలో మరోసారి టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ పొత్తుపై పవన్ ఇచ్చే క్లారిటీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

టీడీపీతోనే ఎందుకు?
పవన్ కళ్యాణ్ జనసేన ఇప్పటికే కమ్యూనిస్టులు, వారికి పరస్పరం విరుద్ధంగా ఉండే బీజేపీ, అలాగే టీడీపీతోనూ కలిసి రాజకీయ ప్రయాణం చేసేసింది. వీరిలో ప్రస్తుతం బీజేపీతో కలిసి సాగుతోంది. అయితే ఇందులో జనసేన రాజకీయంగా స్వయంగా బరిలోకి దిగింది మాత్రం 2019 పోరులోనే. తొలిసారి బరిలోకి దిగినప్పుడు ఉన్న భారీ అంచనాలకు తోడు పార్టీ పనితీరుపై క్షేత్రస్ధాయిలో సదభిప్రాయం లేకపోవడం, టీడీపీతో పరోక్ష పొత్తు విమర్శల నేపథ్యంలో కేవలం ఒక్క సీటుకు పరిమితం కావాల్సి వచ్చింది.
కానీ అదే టీడీపీతో నేరుగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ అయినా గెలిచే అవకాశం ఉండేది. ఇప్పుడు అదే అంశం జనసేన-టీడీపీని దగ్గర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ దిశగా పవన్ ఇవాళ ఓ ప్రకటన చేస్తారని క్యాడర్ కూడా ఆశిస్తోంది.
Recommended Video

జనసేన క్యాడర్ కోరుకుంటోంది ఇదే ?
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన క్యాడర్ ఇప్పుడు కోరుకుంటోంది ఒక్కటే. అధికార పార్టీ అయిన వైసీపీ చేస్తున్న కక్షా రాజకీయాలతో క్షేత్రస్ధాయిలో తాము నిలదొక్కుకోవడం కూడా కష్టంగా ఉంది. దీన్ని తట్టుకోవాలంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీతో కచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిందే. అలా కాదని ఇంకా బీజేపీ వంటి ఓట్లు, సీట్లు లేని పార్టీతో కొనసాగడం వల్ల రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనం లేదు.
అదే టీడీపీతో అయితే వారి క్యాడర్ బలానికి తమ క్యాడర్ కూడా తోడయితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కనీస స్ధానాలు గెల్చుకోవాలన్నా నియోజకవర్గాల్లో స్ధానికంగా టీడీపీ సాయం అవసరమనేది జనసైనికులు కోరుకుంటున్నారు. మరి ఈ దిశగా పవన్ ఏ నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications