వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో జగన్‌తో కలుస్తారా?: పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు!

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని అందుకే తాను మద్దతివ్వలేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉన్నందువల్లే తాను 2014లో మద్దతివ్వలేదని చెప్పారు. ఇప్పుడు అదే పవన్.. చంద్రబాబు ప్రభుత్వంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2019లో జగన్‌, పవన్ కళ్యాణ్ కలిసి నడుస్తారా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

రాజమహేంద్రవరం పర్యటనలో జగన్‌పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ శుక్రవారం మాత్రం మాటల దాడి తగ్గింది. ఆయనపై మెత్తబడినట్లుగా ఉందని అంటున్నారు.

Will Pawan Kalyan go with YS Jagan in next elections?

2019 ఎన్నికల్లో వైసీపీతో జనసేన పెత్తు పెట్టుకుంటుందనే ప్రచారం గతంలో జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైసీపీ, జనసేన వేర్వేరుగా డిమాండ్ చేశాయి. ఈ సందర్భంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చునని భావించారు.

అయితే జగన్‌కు మద్దతు విషయంలో ఇప్పుడు పవన్ కొంత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. జగన్‌పై కేసులు లేకుంటే ఆయనకు మద్దతు ఇచ్చేవాడినని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుపై అదే అనుమానం వ్యక్తం చేస్తున్న పవన్.. మళ్లీ జత కలుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్‌తో వెళ్లే ప్రసక్తి లేదని మాత్రం దాదాపు క్లారిటీ వచ్చిందంటున్నారు.

English summary
Will Jana Sena chief Pawan Kalyan go with YSR Congress Party chief YS Jagan in next elections?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X