మోడీ కదిలినా..: ఆసక్తికర వ్యాఖ్యలు - పవన్ కళ్యాణ్ పోరు వృథానా?

అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సీమాంధ్ర ఆత్మగౌరవ సభ', ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమం సఫలమయ్యేనా, వృథానేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మాటలు చూస్తుంటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.

దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా పైన పవన్ ఓపిక పట్టారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. తనకు ప్రత్యామ్నాయం లేక 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికానని, అలాగే ప్రధాని మోడీ అంటే గౌరవం ఉందని, కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే మాత్రం నిలదీస్తానన్నారు.

ఈ మేరకు ఆయన ప్రత్యేక హోదా యుద్ధ రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి కాకినాడలో సభను ప్రారంభిస్తున్నారు. వరుసగా అన్ని జిల్లాల్లో హోదా సభలను నిర్వహించనున్నారు. అదే సమయంలో పవన్ కారణంగా కేంద్రంలోను కదలిక వచ్చింది.

కదలిక వచ్చినప్పటికీ.. అది కేవలం భారీ ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ. అయితే, తమకు ప్యాకేజీలు కావాలి... అలాగే హోదా ముఖ్యమని ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయితే, నేతల మాటలు.. ముఖ్యంగా ఢిల్లీ నేతల మాటలు మాత్రం హోదా ఇచ్చే అవకాశాలు లేనట్లుగానే ఉన్నాయని అంటున్నారు.

ఒకవేళ హోదా సాధిస్తే ఆ క్రెడిట్ ఎక్కువ శాతం పవన్‌కే దక్కుతుందని, ఇప్పుడు ఢిల్లీలో భారీ ప్యాకేజీ కదలిక క్రెడిట్ పవన్‌కే దక్కుతుందని, హోదా వచ్చినా ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుందని అంటున్నారు. కానీ వారి మాటలు చూస్తుంటే పవన్ ప్రయాస వృథాయేనా అనే చర్చ కూడా జరుగుతోంది. హోదా పైన బీజేపీ, టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమం సఫలమయ్యేనా, వృథానేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మాటలు చూస్తుంటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.

పురంధేశ్వరి

పురంధేశ్వరి

ఏపీకి ప్రత్యేక హోదా అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదని పురంధేశ్వరి అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘంతో ప్రత్యక్షంగా చెప్పకపోయినా, వారి చర్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. దేశంలో పదకొండు రాష్ట్రాలు హోదా అడుగుతున్నాయన్నారు. హోదా ఇవ్వడం కుదరకపోతే ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

కేఈ కృష్ణమూర్తి

కేఈ కృష్ణమూర్తి

కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక హోదానే తీసి వేద్దామని చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం ఏమిటని టిడిపి నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం అన్నారు.

హరిబాబు

హరిబాబు

ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ హరిబాబు అన్నారు. హోదాతో పాటు లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు.

సిద్ధార్థనాథ్ సింగ్

సిద్ధార్థనాథ్ సింగ్

ఏపీకి ప్రత్యేక హోదాకు మించి భారీ ప్యాకేజీ ఇస్తామని ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్ధనాథ్ సింగ్ ఇటీవల ఒకటికి రెండుసార్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+