'ఏపీకి బీజేపీ ప్యాకేజీ పైన పవన్ కళ్యాణ్ సంతోషిస్తారు': రంగంలోకి సుజన
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తాము కలిసి, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ గురించి, దాని వల్ల కలిగే లబ్ధి గురించి వివరిస్తామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సోమవారం నాడు అన్నారు. ప్యాకేజీ గురించి తెలిస్తే పవన్ సంతోషపడతారని చెప్పారు.
హోదా అన్న పేరు మాత్రమే లేదని, అంతకుమించిన నిధులు ప్యాకేజీ రూపంలో వచ్చాయని విడమరిచి చెబితే పవన్ తప్పకుండా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈ పనిని తానే స్వయంగా చేస్తానన్నారు. ప్యాకేజీలో ఉన్న ప్రతిఫలాన్ని గమనించిన వారెవరూ దీన్ని వద్దని చెప్పరన్నారు.
దీనిని స్పెషల్ స్టాటస్ బెనిఫిట్స్ ఇన్ ప్యాకేజ్‌గా చూడాలన్నాపు, జాతీయ ప్రాజెక్టుకు 100 శాతం నిధులిస్తామని చెప్పడం స్వతంత్ర భారత చరిత్రలో ఒక్క పోలవరం విషయంలోనే జరిగిందన్నారు. హోదాతో ఉద్యోగాలు రావని, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఉద్యోగాలు వస్తాయన్నారు.

హోదా పైన మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ చెప్పిన మాటలు వాస్తవం కాదన్నారు. విపక్షాలకు హోదా అంశం సంజీవినిలా మారిందన్నారు. వామపక్షాలు ఎక్కడ పడితే అక్కడ జెండాలు పాతితే కుదరదని హెచ్చరించారు. పరిశ్రమలకు భూములు ఇస్తుంటే అడ్డుకోవడం ఏమిటన్నారు.
యూరిలో తీవ్రవాద దాడిలో జవాన్లు వీరమరణం పొందడం పైన సుజనా చౌదరి స్పందించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దన్నారు. ఉగ్రవాదాన్ని ఎక్కడికి అక్కడ గట్టిగా అణిచి వేయాలని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వీరజవాన్లకు సుజన సంతాపం తెలిపారు. కాగా, ఉగ్రదాడి పైన యావత్ భారత దేశం మండిపడుతోంది.












Click it and Unblock the Notifications