మీ ఎంపీలతో మాకు మద్దతిస్తావా: బాబుకు అంబటి, ఏపీలో దుష్టశక్తి: చికాగోలో శ్రీకాంత్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి టూరిస్ట్ సీఎంగా మారారని వైసిపి నేత అంబటి రాంబాబు ఆదివారం నాడు మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం వైసిపి మంగళవారం నుంచి చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామన్నారు. హోదా కోసం వైసిపి ఢిల్లీలో మరోసారి ఉద్యమిస్తుందని చెప్పారు. తమకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలను పంపుతారా అని బాబును ప్రశ్నించారు.

చంద్రబాబును కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదని, కేంద్రంతో పోరాడే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలే ఆయన చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొందన లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాలని అందరికీ పంపిణీ చేశామని, దీనిపై కేంద్రం సీబీఐ విచారణ జరుపుతుందని ఆయన భయపడుతున్నారన్నారు.
దుష్టశక్తుల గుప్పిట్లో ఏపీ
ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ఏపీ దుష్ట శక్తుల గుప్పెట్లో కూరుకుపోయిందని, దానిని రక్షించి సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా వైసిపి కంకణం కట్టుకుందని ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అమెరికాలోని చికాగో నగరంలో అన్నారు.
చికాగోలో ఆరోరాలో టామరిండ్ ఇండియన్ కుసిన్‌లో వైసిపి సేవ్ డెమోక్రసీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications