వెంకయ్య నాయుడు తేల్చేసారు..!! పదవీ కాలం పూర్తయ్యాక - వాట్ నెక్స్ట్ : రాజకీయంగా..!!
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరో నాలుగు నెలలు తన పదవిలో కొనసాగనున్నారు. ఆ తరువాత..ఆయనకు ప్రమోషన్ గా రాష్ట్రపతి పదవి లభిస్తుందా. లేక, ఉపరాష్ట్రపతిగా మరో టర్మ్ కొనసాగుతారా. లేకుంటే మరోసారి రాజకీయంగా కీలకంగా మారుతారా. ఇప్పుడు ఏపీతో పాటుగా కర్ణాటక రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం పైన చర్చ సాగుతోంది. దీని పైన వెంకయ్య నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. బెంగళూరు ప్రెస్ క్లబ్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ సర్కిల్స్ లో మరోసారి చర్చ మొదలైంది.

రాజకీయాల్లోకి రాను..అలాగనీ..
తన మూడు నెలల కాల పరిమితి ముగిసిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి రానని వెంకయ్య నాయుడు స్పష్టం చేసారు. అలాగని విశ్రాంతి తీసుకోనని చెప్పారు. బెంగుళూరు తనకు గౌరవం ఇచ్చిందన్నారు. అక్కడే తన స్నేహితులను కలుస్తానని..కర్ణాటక ప్రజలు మంచి స్నేహితులను కితాబిచ్చారు. బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు...2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహించారు. అయితే, అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవి దక్కింది. నిత్యం పార్టీ లో..ప్రజలతో మమేకం అయ్యే వెంకయ్య నాయుడు ఆ పదవితో రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇక, త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రపతిగా ప్రమోషన్ దక్కేనా..
ఈ ఎన్నికల్లో దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే..వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి గా ప్రమోషన్ దక్కుతుందనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దక్షిణాదికి ఆ ఛాన్స్ దక్కకపోతే..ఉపరాష్ట్రపతిగా మరోసారి రెన్యువల్ చేస్తారంటూ అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులు సైతం ఉపరాష్ట్రపతి నుంచి ప్రమోషన్ దక్కితే స్వీకరించాలని సూచించారు. అయితే, తనకు ప్రమోషన్ గురించి ఎటువంటి సమాచారం లేదని వెంకయ్య తేల్చి చెప్పారు. ఇప్పటికీ..ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రపతి ఎన్నిక పైన అటు ఎన్డీఏ..ఇటు యూపీఏ కూటమి లు తమ మద్దతు పార్టీలతో వ్యూహా ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

ఉపరాష్ట్రపతిగా మరో టర్మ్ కొనసాగేనా
రాష్ట్రపతి ఎన్నికల్లో మూడు ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్.. వైసీపీ..బీజేడీ మద్దతు కీలకంగా మారింది. ఇక, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలోనూ టీఆర్ఎస్ - వైసీపీ మద్దతుగా నిలిచాయి. దీంతో..పాటుగా రాష్ట్రపతిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు సైతం రేసులో ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25 వరకు ఉంది. అదే ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు 2017 ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే ఉప రాష్ట్రపతి పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో..ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ప్రమోషన్ దక్కుతుందా లేదా అనేది తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, వెంకయ్య నాయుడు మాత్రం తన పదవీ కాలంగా ముగిసిన తరువాత ఏం చేయాలనేది దాని పైన ఎటువంటి ఆలోచనలతో ఉన్నారో సంకేతాలు ఇస్తున్నారు. రాజకీయాల్లోకి రానని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications