జగన్ పై అనర్హత వేటు సాధ్యమేనా? రూల్స్ ఏం చెప్తున్నాయి?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కు బాధితుడైన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అయితే రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటివరకూ అసెంబ్లీకి రాలేదు. తొలుత ఆయన్ను అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కూడా కలిసి విజ్ఞప్తి చేసిన రఘురామ.. ఆ తర్వాత కూడా స్పందనలేకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరిక చేశారు.

అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యత అని, ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామంటూ జగన్ ను ఉద్దేశించి రఘురామ తాజాగా చేసిన హెచ్చరిక చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రాజ్యాంగంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇందులో అసెంబ్లీకి వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చా లేదా అనే దానిపై నిబందనలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం..

will ys jagan can be disqualified on 60 day attendance grounds what is rule position

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం, ఒక ఎమ్మెల్యేను అనర్హుడిని చేయాలంటే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయొచ్చు. అలాగే ఎమ్మెల్యే మానసిక స్దితి సరిగా లేది కోర్టు ప్రకటిస్తే ఇలా అనర్హుడిని చేయొచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకుని చెల్లించలేక దివాళా తీస్తే కూడా చేయొచ్చు. అలాగే భారత దేశ పౌరుడై ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు వేయవచ్చు. ఇలా ఆర్టికల్ 191లోని షరతుల వల్ల ఎవరినైనా అనర్హులుగా ప్రకటించవలసి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్‌ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.

ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు.ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే. ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పార్టీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా సభలో ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా అనర్హత వేటు వేయవచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని మూడింట ఒక వంతు మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని విభజనగా పరిగణిస్తారు.ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హట వేటు స్పీకర్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

will ys jagan can be disqualified on 60 day attendance grounds what is rule position

అయితే పార్లమెంట్ వరకూ మాత్రం ఓ ఎంపీ స్పీకర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దీంతో గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామ.. ఈ నియమాన్ని అసెంబ్లీకి వర్తింపచేసి చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఇది కాకపోతే మాత్రం ఎమ్మెల్యేపై అసెంబ్లీకి 60 రోజులు రాలేదన్న కారణంతో అనర్హత వేటు కుదరదని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ అధికారులు మాత్రం సభ్యుల అనర్హతపై స్పీకర్ నిర్ణయమే అంతిమం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+