చంద్రబాబుపై జగన్ అంచనాలు పెరిగాయా ? అడ్డగింతలతో ఎవరికి మైలేజ్ ?

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో వైఎస్ జగన్ కూడా వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుపై జగన్ అంచనాలు కూడా పెరిగినట్లు కనిపిస్తోంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడైన విధానాలతో విపక్షాలు కూడా దూకుడు పెంచాయి. ఈ మూడున్నరేళ్లలో వైసీపీ నేతలు ప్రదర్శిస్తున్న దూకుడును అందుకునేందుకు విపక్షాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు వైసీపీ నేతలకు పోటీగా బూతుపర్వాన్ని కూడా అందుకుంటున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా మారిపోయిన రాజకీయంలో విపక్ష నేత చంద్రబాబు వరుస టూర్లతో చేస్తున్న రచ్చ ఇప్పుడు ఆయనపై వైసీపీ అంచనాల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ వర్సెస్ చంద్రబాబు

జగన్ వర్సెస్ చంద్రబాబు

ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయానికి దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. అయినా ఇప్పటికీ అది కొత్తగానే కనిపిస్తోంది. దీనికి కారణం ఇరువురూ పరస్పరం ప్రదర్శిస్తున్న దూకుడే. అయితే 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన వైఎస్ జగన్ కు అది శాశ్వతం కాదనే సంకేతాల్ని మాత్రం తాజాగా టీడీపీ అధినేత పంపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబు దూకుడు పెరుగుతుండటం సీఎం జగన్ ను కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా నిత్యం చేస్తున్న విమర్శల్ని ఎక్కడికక్కడ కౌంటర్ చేయించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు టూర్లకు అడ్డంకులు

చంద్రబాబు టూర్లకు అడ్డంకులు

చంద్రబాబు రాష్ట్రంలో ఈ మధ్య వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతీ చోటా జగన్ పైనా, వైసీపీ సర్కార్ పైనా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ విమర్శలు జనంలోకి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు సభలకు వస్తున్న జనం, స్ధానికంగా మళ్లీ యాక్టివ్ అవుతున్న టీడీపీ క్యాడర్, నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్ ను ఆలోచనలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం జీవో నంబర్ 1ను ప్రయోగించింది. దీనికి కోర్టులోనూ వ్యతిరేకత రాకపోవడంతో పోలీసుల సాయంతో చంద్రబాబు సభల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అడ్డంకులతో మైలేజ్

అడ్డంకులతో మైలేజ్


చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ సర్కార్ పోలీసుల సాయంతో సభల్ని అడ్డుకుంటోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. చంద్రబాబు తన యాత్రలేదో, సభలేవో పెట్టుకునేందుకు ప్రభుత్వం వదిలేస్తే ఆయన ఎంత మైలేజ్ తెచ్చుకుంటారో తెలియదు కానీ.. ఇప్పుడు వైసీపీ సర్కార్ కల్పిస్తున్న అడ్డంకులతో మాత్రం కచ్చితంగా టీడీపీ అధినేతకు మైలేజ్ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినా వైసీపీ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కుప్పం టూర్లో చంద్రబాబుకు అడ్డంకులు కల్పించిన వైసీపీ సర్కార్.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే ప్రయత్నం చేసింది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఎన్నికల నాటికి 2019లో కోల్పోయిన ఆదరణను చంద్రబాబు తిరిగి తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి.

చంద్రబాబుపై జగన్ అంచనాలు పెరిగాయా ?

చంద్రబాబుపై జగన్ అంచనాలు పెరిగాయా ?


2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబుపై జనం అంచనాలతో పాటు వైసీపీ సర్కార్, వైఎస్ జగన్ అంచనాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అవి ఏ స్దాయికి వెళ్లాయంటే చంద్రబాబు, టీడీపీ రాష్ట్రంలో తిరిగి పుంజుకోవడం కష్టమనే స్దాయికి వెళ్లాయి. దీంతో చంద్రబాబు పర్యటనల్ని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. కరోనాలో హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు ఆ తర్వాత ఏపీలో పర్యటించినా జగన్ అడ్డంకులు కల్పించలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు సభలకు జనాలు తరలిరావడం పెరిగిందో, ఈ మేరకు నిఘా నివేదికలు వస్తున్నాయో అప్పటి నుంచి టీడీపీ అధినేతపై జగన్ అంచనాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్దితి కొనసాగితే ఎన్నికల నాటికి పరిస్దితులు తారుమారు కావొచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు టూర్లను పోలీసుల సాయంతో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సిన పరిస్ధితి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+