YSRCP: ఫినిక్స్ అవుతుందా ? విలీనమవుతుందా ?- వైసీపీ ఫ్యూచర్ పై రాష్ట్రంలో చర్చ..!
ఏపీలో ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న దారుణ పరాజయం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చేసింది. ముఖ్యంగా అసెంబ్లీలో కేవలం 11 సీట్లకు, లోక్ సభలో నాలుగు ఎంపీలకు పరిమితం కావడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. పరాజయం ఓ బాధ అయితే సాధించిన సీట్లు ఆ పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో భవిష్యత్ వ్యూహాలపై వైసీపీ దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు, విలీనం వంటి పలు ఆప్షన్లపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో గతంలో టీడీపీ సాధించిన 23 సీట్ల ఓటమిపై పదే పదే ఆ పార్టీని టార్గెట్ చేసిన వైసీపీకి ఇప్పుడు తమకు ఎదురైన 11 సీట్లను ఎలా సమర్ధించుకోవాలో తెలియని దుస్థితి ఎదురవుతోంది. అంతే కాదు రాష్ట్రంతో పాటు లోక్ సభలోనూ తగ్గిపోయిన ప్రాతినిథ్యం దృష్టా కేంద్రంలోనూ తమ మాట చెల్లని పరిస్ధితి. కేవలం రాజ్యసభలో మాత్రం 11 మంది ఎంపీలున్నారు. వీరి సాయంతో వచ్చే ఐదేళ్లూ బండి లాగే పరిస్ధితులూ కనిపించడం లేదు.

అన్నింటికంటే మించి గతంలో టీడీపీ ఓటమిపాలు కాగానే ఆ పార్టీ ఎంపీల్ని తమవైపు తిప్పేసుకున్న బీజేపీ అనుభవాలు ఇప్పుడు వైసీపీకి గుర్తుకొస్తున్నాయి. తమ ఎంపీల్ని సైతం ఈ ఐదేళ్ల కోసం బీజేపీ తమవైపు తిప్పేసుకుంటే రాజ్యసభలో బిల్లులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్ధితులు పూర్తిగా తగ్గిపోయాయి. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లోనూ వైసీపీ అప్రాధాన్య పార్టీగా మారిపోవడం ఖాయం.
ఇలాంటి పరిస్ధితే ఎదురైతే ఏం చేయాలనే దానిపై వైసీపీ ఇప్పుడే దృష్టిసారించక తప్పడం లేదు. ఎందుకంటే కేంద్రంలో బలహీనంగా ఉన్న ఎన్డీయేను బలోపేతం చేసుకునేందుకు మోడీ కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇందుకోసం కేంద్రంలో ఇండియా కూటమి పార్టీలతో పాటు తటస్ధమని చెప్పుకుంటున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలపై ఫోకస్ చేయడం ఖాయం. అప్పుడు బీజేపీకి సరెండర్ అయిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత ఆదినారాయణరెడ్డి ఈ విషయం పరోక్షంగా చెప్పేశారు.
అటు ఎన్డీయేలో టీడీపీ, జనసేన ఉండగా వైసీపీ చేరదు కాబట్టి కాంగ్రెస్ వైపు దృష్టిసారిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
అయితే ఏపీలో ఐదేళ్లలోనే ఓడలు బండ్లు, బండ్లు ఓడలయ్యే పరిస్ధితులు ఉన్నాయి కాబట్టి పోరాటాలు కొనసాగించడం, అవసరమైతే జైలుకెళ్లేందుకైనా జగన్ సిద్ధమవుతున్నారని మరో ప్రచారం సాగుతోంది. గతంలోనూ పోరాటాల ద్వారా వైసీపీని శత్రు దుర్భేద్యంగా మార్చిన జగన్.. ఈసారి కూడా అదే బాట ఎంచుకుంటే ఐదేళ్ల పాటు కష్టపడి తిరిగి అధికారంలోకి రావచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications