వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ కు పులివెందుల కన్నా ఇక్కడ గెలుపే అత్యంత ప్రతిష్టాత్మకం!!

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప జిల్లా అంటేనే మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌. ఆ త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌లా మారింది. అడ‌పా ద‌డ‌పా తెలుగుదేశం పార్టీ విజ‌యాలు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఆ జిల్లాపై మాత్రం పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించ‌లేక‌పోతోంది. ఈ జిల్లాలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీకి కంచుకోట‌లా చెప్ప‌వ‌చ్చు. పులివెందుల త‌ర్వాత ముఖ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగు. దివంగత వైఎస్ ఉన్న స‌మ‌యంలో ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ అల‌వోక‌గా విజ‌యం సాధించేది. 1983 నుంచి 1999 వ‌ర‌కు తెలుగుదేశం పార్ట ఇక్కడ ఘ‌న‌విజ‌యాలు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఏ ఎన్నిక‌ల్లోను గెల‌వలేక‌పోయింది.

వైసీపీపై తీవ్రస్థాయిలో దాడి

వైసీపీపై తీవ్రస్థాయిలో దాడి

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన‌ప్ప‌టికీ వైసీపీపై మాత్రం విమ‌ర్శ‌ల దాడిని ఆప‌లేదు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

వ్యక్తిగతంగా ఆదికి ఫాలోయింగ్

వ్యక్తిగతంగా ఆదికి ఫాలోయింగ్


జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి తానే బ‌రిలో ఉంటాన‌ని, త‌న‌పై పోటీకి ఎవ‌రు వ‌స్తారో రావాలంటూ స‌వాల్ విసురుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆదినారాయ‌ణ‌రెడ్డికి వ్య‌క్తిగ‌తంగా ఫాలోయింగ్ ఉంది. అయితే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేస్తే గెల‌వ‌గ‌లుగుతారా? అంటే సందేహ‌మే. నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తాపార్టీకి బ‌లం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి షాక్ ఇవ్వాలంటే ఉన్న బ‌లానికి తోడు తెలుగుదేశం పార్టీ బ‌లం కూడా తోడ‌వ్వాలి. అది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.

పొత్తు కుదిరితే ఛాలెంజ్ నెగ్గగలరా?

పొత్తు కుదిరితే ఛాలెంజ్ నెగ్గగలరా?


తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు కుదిరితే ఈ సీటు బీజేపీకి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు అప్పుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీకి దిగ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడి కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు. ఒక‌వేళ ఆది టీడీపీలో చేరి టికెట్ ద‌క్కించుకుంటే భూపేష్‌రెడ్డి స‌హ‌క‌రిస్తార‌నే న‌మ్మ‌కాన్ని ఆది అనుచ‌రులు వ్య‌క్తం చేస్తున్నారు. లేదంటే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీకి దిగితే విజయకేతనం ఎగరవేసి తన ఛాలెంజ్ ను నెగ్గించుకోగలరా? అనేది తేలాలంటే కొన్నాళ్లు వేచిచూడక తప్పదు మరి.

English summary
After Pulivendula, the most important constituency is Jammalamadugu.During the tenure of late YS, the Congress party was victorious here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X