అనుమానాస్పద స్థితిలో కూతుళ్లతో తల్లి ఆత్మహత్య
కర్నూలు: అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. త్యాపల్లి మండలం పెద్దపూజల్ల గ్రామానికి చెందిన శ్యాంకుమార్‌రెడ్డికి డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి కుమార్తె ఉషారాణి(28)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి నేహారెడ్డి(05), లక్ష్మీ తనూజ(03) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పెళ్లినాటినుంచే భర్త తనను వేధిస్తున్నట్టు కూతురు తనతో చెప్పేదని తండ్రి రామకృష్ణారెడ్డి అంటున్నారు. వారం క్రితం మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఉషారాణి బుధవారం రాత్రి తిరిగి డోన్‌లోని భర్త ఇంటికి పిల్లలతో సహా చేరుకుంది.

అయితే గురువారం సాయంత్రం ఉషారాణి, ఇద్దరు పిల్లలతో సహా విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించిన భర్త శ్యాంకుమార్‌రెడ్డి ఉషారాణి తండ్రికి సమాచారం అందించారు. ఆయన తన కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై సుబ్రహ్మణ్యరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కిరోసిన్ పోసి, తాను పోసుకుని కూతుళ్లకు నిప్పంటించిన రాణి తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications