భవనంపై నుంచి దూకి కొడుకు సహా తల్లి ఆత్మహత్య

వీరికి కార్తీక్ (3) అనే కొడుకు ఉన్నాడు. ఐదు సంవత్సరాల నుంచి కవిత మానసిక వ్యాథితో బాధపడుతోంది. కొంతకాలంగా ఈమెకు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రతి నెలా తల్లిదండ్రులు కవితని తమ ఇంటికి తీసుకువచ్చి ఆస్పత్రిలో చూపించి మందులు ఇచ్చి పంపిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూతుర్ని ఇంటికి తీసుకువచ్చిన తండ్రి ఆస్పత్రిలో చూపించి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చాడు.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కరెంట్ పోవటంతో కుటుంబసభ్యులంతా ఇంటి బయట కూర్చున్నారు. కరెంట్ వచ్చాక అందరూ ఇంట్లోకి వెళ్లగా కవిత మాత్రం కొడుకుతో పాటు బయటే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత సమీపంలో ఖాళీగా ఉన్న ఐదంతస్థుల భవనం పైకి ఎక్కింది. ముందుగా కొడుకును కిందకు వదిలి తర్వాత తానూ దూకేసింది.
కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కవిత తమ్ముడు రాజు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సీఐ శ్రీకాంత్‌గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications