నర్సులు సిజేరియన్ చేసి మహిళను చంపేశారు

ఆగ్రహించిన మహిళ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని రామగుండం శాసనసభా నియోజకవర్గంలోని గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. డెలివరీ కోసం శనివారం ఉదయం అల్లూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల వేగోలపు కావ్య అనే మహిళ ఆస్పత్రికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి ఆమెకు నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో డాక్టర్ లేడు. ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. వారిద్దరు
ఆ మహిళను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకుని వెళ్ల సర్జరీ చేశారు. ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే, నర్సులు రక్తస్రావాన్ని నియంత్రించలేకపోయారు.
విషయం డాక్టర్‌కు చెప్పారు. డాక్టర్ వచ్చేలోగానే మహిళ మరణించింది. సంఘటనపై విచారణ నిమిత్తం కమిటీ వేశారు.












Click it and Unblock the Notifications