స్త్రీపై గ్యాంగ్ రేప్: భర్త మృతిని తట్టుకోలేక భార్య
విజయవాడ: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఒక మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
అటెండర్ ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లా వినుకొండ కేంద్రంగా సాగుతున్న బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాల వ్యవహారంలో రెవెన్యూ శాఖ అటెండర్ ఉరివేసుకుని ఆత్మ హత్యాయత్నం చేశారు. ఆ అటెండర్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు దర్యాప్తునకు పిలిపిం చారు. గతంలో తహసీల్దార్ కార్యాలయంలో బ్రోకర్లకు రెండు ఖాళీ పట్టాదారు పాస్‌పుస్తకాలు అటెండర్ అమ్మినట్లు తెలిసింది. విచారణతో బెంబేలెత్తి ఉరేసుకున్న అటెండర్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

భర్త మరణవార్తతో భార్య
భర్త మరణ వార్తతో ఓ మహిళ తాను కూడా అర్థాంతరంగా తనువు చాలించింది. కడప జిల్లా చిట్వేలు మంలం కెఎస్ అగ్రహారానికి చందిన రైతు బాలచంద్రా రెడ్డి (35) శనివారం ఉదయం పొలంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇంట్లో ఉన్న భార్య వనజ (30)కు విషయం తెలిసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె కూడా మరణించింది.
ఆటో ఢీకొట్టి జింక మృతి
అనంతపురం జిల్లాలోని కదిరిలో ప్రమాదవశాత్తు ఓ జింకను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెందింది. కూటగుళ్ల అటవీప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను ఆటో ఢీకొట్టింది. కారెం ఫారెస్ట్ అధికారి సాయిప్రసాద్ ఇతర సిబ్బంది మృతి చెందిన జింకను పశువుల ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో రైలు కింద దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులని గుర్తించారు.












Click it and Unblock the Notifications