ఫుట్‌పాత్‌పై ప్రసవం, మహిళ మృతి (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మానవత్వాన్ని అపహాస్యం చేసే సంఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి ఫుట్‌పాత్‌పై బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ తల్లి కన్ను మూసింది. ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మహిళ మిట్ట మధ్యాహ్నం బిడ్డకు పురుడు పోసింది.

ఈ సంఘటన సోమవారం హైదరాబాద్‌లోని విద్యానగర్ కట్టమైసమ్మ దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది. నాగమయ్యకుంట కట్టమైసమ్మ దేవాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్న కవిత, అఖిల్ దంపతుల కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కవితకు పురుటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె ఫుట్‌పాత్‌పైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్థానికులు 108, నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

ఫుట్‌పాత్‌పై ప్రసవం

ఫుట్‌పాత్‌పై ప్రసవం

కాగితాలు ఏరుకుంటూ జీవనం గడిపుతున్న అఖిల్, కవిత దంపతులు ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నారు. కవిత సోమవారం మధ్యాహ్నం ఫుట్‌పాత్‌పైనే బిడ్డకు జన్మనిచ్చింది.

ఫుట్‌పాత్‌పై ప్రసవం

ఫుట్‌పాత్‌పై ప్రసవం

మగబిడ్డకు జన్మనిచ్చిన కవిత కొద్దిసేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పోలీసులకు స్థానికులకు సమాచారం అందించారు.

ఫుట్‌పాత్‌పై ప్రసవం

ఫుట్‌పాత్‌పై ప్రసవం

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో మగశిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఫుట్‌పాత్‌పై ప్రసవం

ఫుట్‌పాత్‌పై ప్రసవం

మగశిశువుకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+